చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం అంటూ అతడి వీడియో పోస్ట్ చేసి హెచ్చరించిన సజ్జనార్

VC Sajjanar: ఆ వీడియోను ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ నకిలీ వీడియో గురించి టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరించారు. ఇటువంటి వీడియోలు పోస్ట్ చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

‘‘సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ వీడియో ఫేక్‌. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్‌ మీడియాలో పాపులర్‌ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్‌ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదు.

లైక్‌‌లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉంది. సరదా కోసం చేసే ఎడిటెడ్‌ వీడియోలు ఇతరులకు ప్రాణాప్రాయం కూడా కలిగిస్తాయి. ఇలాంటి ఘటనలను టీజీఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంటోంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం’’ అని సజ్జనార్ చెప్పారు. ఆ వీడియోను ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు