Falaknuma Express: సికింద్రాబాద్ చేరుకున్న ఫలక్‭నామా ఎక్స్‭ప్రెస్

7 బోగీలను అక్కడే వదిలి 11 బోగీలతో ఫలక్‭నామా ఎక్స్‭ప్రెస్ బయల్దేరింది. మంటల్లో చిక్కుకున్న బోగీల్లో మూడు బోగీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కాగా, రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు

Secunderabad Railway Station: అగ్ని ప్రమాదానికి గురైన ఫలక్‭నామా ఎక్స్‭ప్రెస్‭లో మంటల్లో దగ్ధం అయిన బోగీలను సికింద్రాబాద్ చేరుకుంది. మొత్తం ఏడు బోగీలను ప్రమాద స్థలంలోనే వదిలి మిలిని బోగీలతో రైలు సికింద్రాబాద్ వచ్చింది. కాగా, రైలు ప్రయాణికులను సురక్షితంగా బస్సుల్లో గమ్యస్థానాలకు తరలించినట్లు తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఇక ప్రమాద స్థలంలో ట్రాకులను పునరుద్ధించి, పరిస్థితిని పూర్వస్థితికి తీసుకువచ్చేందుకు పోలీసు, ఫైర్, రైల్వే సిబ్బంది కలిసికట్టుగా పని చేస్తోందని ఆయన తెలిపారు.

Falaknuma Express: ఫలక్‭నామా ఎక్స్‭ప్రెస్ రైలు ప్రమాదం ముందుగా ప్లాన్ చేసిందా? కలకలం సృష్టిస్తున్న అగంతకుడి లేఖ

రైలులో 18 బోగీలు ఉండగా.. 7 బోగీలను అక్కడే వదిలి 11 బోగీలతో ఫలక్‭నామా ఎక్స్‭ప్రెస్ బయల్దేరింది. మంటల్లో చిక్కుకున్న బోగీల్లో మూడు బోగీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కాగా, రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. కాగా, షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని కొద్ది సేపటికి క్రితం రైల్వే అధికారులు తెలిపారు.