Cricket Tickets Extra Charges : హైదరాబాద్ లో క్రికెట్ టికెట్స్ అమ్మకాల్లో గందరగోళం..అదనపు చార్జీలు వసూళ్లపై ఫ్యాన్స్ ఆగ్రహం

హైదరాబాద్ లో క్రికెట్ టికెట్స్ అమ్మకాలపై మరోసారి వివాదం రేగింది. వన్డే మ్యాచ్ క్రికెట్ టికెట్స్ విక్రయాల్లో గందరగోళం నెలకొంది. ఈ నెల 18న ఇండియా-న్యూజిలాండ్ వన్డే క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి ఆన్ లైన్ క్రికెట్ టికెట్ల అమ్మకాలు ఇవాళ్టితో ముగియనున్నాయి.

cricket tickets

Cricket Tickets Extra Charges : హైదరాబాద్ లో క్రికెట్ టికెట్స్ అమ్మకాలపై మరోసారి వివాదం రేగింది. వన్డే మ్యాచ్ క్రికెట్ టికెట్స్ విక్రయాల్లో గందరగోళం నెలకొంది. ఈ నెల 18న ఇండియా-న్యూజిలాండ్ వన్డే క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి ఆన్ లైన్ క్రికెట్ టికెట్ల అమ్మకాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. అదనపు చార్జీలు వసూళ్లపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అయితే ప్రతి టికెట్ పై 10 శాతం అదనంగా వసూలు చేస్తున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫిజికల్ టికెట్ పై ఒక ధర, ఆన్ లైన్ లో మరో రేటు వసూలు చేస్తున్నారని పేటీఎంలో భారీగా సర్వీస్ చార్జ్ వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. హెచ్ సీఏ పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. అభిమానులపై భారం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటితో క్రికెట్ ఆన్ లైన్ టికెట్స్ అమ్మకాలు ముగియనున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ హైదరాబాద్ కు చేరుకుంది. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ కు టీం ఇండియా చేరుకోనుంది. రెండు జట్లూ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాయి. ఈనెల 18న జరుగబోయే మ్యాచ్‌లో పాల్గొంటాయి.

India History : 317 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై ఘనవిజయం.. వన్డే క్రికెట్ హిస్టరీలో భారత్ రికార్డ్

ఈ నెల 18న హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో ఇండియా–న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నిర్వహణ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం (జవనరి 13) నుంచి హెచ్‌సీఏ ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. పేటీఎమ్ యాప్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్నారు. హెచ్‌సీఏ తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 29 వేల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. అయితే, శుక్రవారం 6 వేల టిక్కెట్లు మాత్రమే ఆన్‌లైన్‌లో ఉంచారు.

మిగిలిన టిక్కెట్లను దశలవారీగా అందుబాటులోకి తీసుకొచ్చారు. జనవరి 16, సోమవారం వరకు టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఉంటాయి. ఇటీవల ఉప్పల్‌లో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లను కేవలం ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వాళ్లు వాటికి సంబంధించిన క్యూఆర్ కోడ్ చూపించి ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో ఫిజికల్ టిక్కెట్లు తీసుకోవచ్చు.