TSRTC: తెలంగాణ ఆర్టీసీ బాజిరెడ్డి గోవర్దన్‭కి వీడ్కోలు.. బస్ భవన్‭లో సన్మానం

చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ సారథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా  సంస్థ సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని గుర్తుచేశారు. తాను రాజకీయ నాయకుడిలా కాకుండా సంస్థతో మమేకమై పనిచేసి.. టీఎస్ఆర్టీసీని ముందుకు నడిపించారని కొనియాడారు.

TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) చైర్మన్ గా పదవీ కాలం పూర్తయిన సందర్భంగా బాజిరెడ్డి గోవర్దన్ కి సంస్థ ఉన్నతాధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. బాజిరెడ్డి గోవర్దన్-వినోద దంపతులను ఘనంగా సన్మానించారు. చైర్మన్ గా రెండేళ్ల తన పదవీ కాలంలో ఆయన సంస్థకు చేసిన సేవలను కొనియాడారు. హైదరాబాద్ లోని బస్ భవన్ లో బాజిరెడ్డి గోవర్దన్ గారికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని మంగళవారం టీఎస్ఆర్టీసీ నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో సంస్థ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ.. రెండేళ్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు నిర్వర్తించడం తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆర్టీసీ చైర్మన్ గా పనిచేసిన కాలం జీవితంలో మరిచిపోలేనని చెప్పారు. చిన్నతనం నుంచే ఆర్టీసీతో తనకు అనుబంధముందన్నారు. తాను, ఎండీ సజ్జనర్ 18 రోజుల వ్యవధిలోనే బాధ్యతలు స్వీకరించామని, ఆ సమయంలో ఎన్నో సవాళ్లు తమకు స్వాగతం పలికాయని గుర్తు చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూనే.. సంస్థ బాగుండాలని, 45 వేల ఉద్యోగులకు భరోసా కల్పించాలని అనునిత్యం తపించామని చెప్పారు. తన పదవీ కాలంలోనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. అధికారులు, ఉద్యోగుల సమిష్టి కృషితోనే సంస్థకు సత్పలితాలు వస్తున్నాయని చెప్పారు. తన విధి నిర్వహణలో తోడ్పాటు అందించిన సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తో పాటు అధికారులు, ఉద్యోగులకు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Bihar Politics: 37 ఏళ్లలో 12 మంది సీఎంలు అగ్రవార్ణాలు.. 2 ఏళ్లలో 3 దళిత సీఎంలు.. బిహార్‭లో కొత్త చర్చను లేపుతున్న కులగణన

సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ సారథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా  సంస్థ సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని గుర్తుచేశారు. తాను రాజకీయ నాయకుడిలా కాకుండా సంస్థతో మమేకమై పనిచేసి.. టీఎస్ఆర్టీసీని ముందుకు నడిపించారని కొనియాడారు. చైర్మన్ గైడెన్స్ పాటు ఉద్యోగులు సమిష్టిగా పనిచేయడం వల్ల సంస్థ వృద్ధి చెందుతోందని, గత రెండేళ్లలో దాదాపు రూ.1600 కోట్ల నష్టాన్ని తగ్గించామని చెప్పడానికి తనకెంతో సంతోషంగా ఉందన్నారు. సంస్థ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. వాటిని పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. ఫలితంగానే సంస్థలోని ప్రతి ఉద్యోగికి 1వ తేదినే జీతాలను సంస్థ ఇస్తోందన్నారు. రైతు కుటుంబం నుంచి కేబినేట్ ర్యాంకైన టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్దన్ ఎదగడం ఆదర్శనీయమన్నారు. భవిష్యత్ లోనూ మరిన్నీ ఉన్నతస్థానాలను ఆయన అధిరోహించాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ అభిలాషించారు. బాజిరెడ్డి గోవర్దన్ సేవలను స్పూర్తిగా తీసుకుని, ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు మరింతగా చేరువచేస్తామని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు