TS Corona Cases : యాదాద్రిలో భయం భయం, కొత్తగా 35 మంది ఆలయ సిబ్బందికి కరోనా, భక్తులకు నో ఎంట్రీ

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదాద్రిలో క్రమంగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఆలయంలో పనిచేసే వారికి వైరస్ సోకుతోంది.

Yadadri Temple : తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. గత సంవత్సరం ఎలాంటి పరిస్థితి ఏర్పడిందే..అలాంటి సీన్స్ మరలా కనిపిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మార్చి నెలాఖరు నుంచి వరుసగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదాద్రిలో క్రమంగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఆలయంలో పనిచేసే వారికి వైరస్ సోకుతోంది. కొత్తగా 35 మంది ఆలయ సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. నిన్న 39 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలిందనే సంగతి తెలిసిందే. దీంతో టెస్టుల సంఖ్యను పెంచారు అధికారులు. మొత్తంగా యాదాద్రిలో వైరస్ సోకిన వారి సంఖ్య 74కు చేరుకుంది.

గత పది రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. భక్తులు కూడా భారీగానే తరలివచ్చి నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే..తాజాగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం…కొంతమందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం ఆరుగురికి కరోనా వైరస్ ఉందని తేలింది. ఇందులో ముగ్గురు సెక్యూర్టీ సిబ్బంది, మిగతా వారు ఆలయ పూజారులు, సిబ్బంది ఉన్నారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వైరస్ పరీక్షలు వేగంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో…పలువురు వైరస్ బారిన పడుతున్నట్లు నిర్ధారిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న వారు తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని అధికారులు సూచించడంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతం ఆలయంలోకి భక్తులు అనుమతించడం లేదు. అలాగే..ఆర్జిత సేవలను కూడా రద్దు చేశారు.

Read More : Ind vs Eng 3rd ODI : ఇంగ్లండ్ లక్ష్యం 330.. వన్డే సిరీస్ ఎవరిదో..?

ట్రెండింగ్ వార్తలు