BJP: కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలోకి పలువురు బీఆర్ఎస్ నేతలు.. తెలంగాణలో 10 సీట్లు గెలవాలన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఏప్రిల్ మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలుండొచ్చని చెప్పారు. 350కు పైగా ఎంపీలతో..

Kishan Reddy

లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో పలువురు బీఆర్ఎస్ నేతలు చేరారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ఏప్రిల్ మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలుండొచ్చని చెప్పారు. 350కు పైగా ఎంపీలతో మూడోసారి మోదీ ప్రధాని అవుతారని అన్నారు. ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా భారతదేశం అవతరించిందని చెప్పారు. మోదీ నేతృత్వంలో చంద్ర మండలంలోనూ అడుగు పెట్టామన్నారు.

అద్భుతంగా జాతీయ రహదారులు వేశారని తెలిపారు. ఒక కుటుంబం చేతిలో పాలన ఉండటంతో తెలంగాణ అప్పుల పాలు అయ్యిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రూటు మ్యాప్ లేకుండా పాలన చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కొన్ని రోజులు గడువు ఇద్దామని అన్నారు. బీఆర్ఎస్ అవసరం ఇప్పుడు తెలంగాణకు లేదని చెప్పారు.

ఈ సందర్భంగా బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నుండి బీజేపీలోకి వస్తున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మోదీకి 10 సీట్లను కానుకగా ఇవ్వాలని అన్నారు.

Ayodhya: ముగియనున్న మోదీ 11 రోజుల దీక్ష.. అందరి నోటా సకల గుణాభిరాముడు నడయాడిన నేల ‘అయోధ్య’ మాట..