Harish Rao introducing budget : అన్ని వర్గాల ఆకాంక్షలకు తగ్గట్టుగా బడ్జెట్ : మంత్రి హరీష్ రావు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆర్థిక మంత్రి టీ.హరీష్ రావు 2021-22 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.

Harish Rao introducing budget : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆర్థిక మంత్రి టీ.హరీష్ రావు 2021-22 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. అన్ని వర్గాల ఆకాంక్షలకు తగ్గట్టుగా బడ్జెట్ ఉంటుందని చెప్పారు. రేపటి అవసరాలకు తగ్గట్టు కేసీఆర్ నేడే ఆలోచించగలరని పేర్కొన్నారు. అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కామని చెప్పారు. కరోనా రూపంలో ఊహించని విపత్తు ఎదురైంది. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయన్నారు.

కరోనా పర్యవసనాలను తెలంగాణ అనుభవించిందన్నారు. ఆర్థిక వ్యవస్థలు తీవ్రస్థాయిలో ప్రభావితమయ్యాయని తెలిపారు. జీడీపీ ఎన్నడూలేని రీతిలో తగ్గిందన్నారు. దేశ జీడీపీతో పోల్చితే తెలంగాణ జీడీపీ ఎక్కువగా ఉందని చెప్పారు. కరోనా సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నామని తెలిపారు. వ్యాక్సిన్ రాకతో సమాజం కోలుకుంటోందన్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో మంచి వృద్ధి ఉంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా తెలంగాణ జీఎస్ డీపీ వృద్ధి రేటు తగ్గిందన్నారు. 2021-22…రూ.1,27,728 ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దేశ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం అధికమన్నారు. పల్లె ప్రగతి తెలంగాణ గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చివేసిందన్నారు. పల్లెలు పరిశుభ్రంగా మారిపోయాయని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు