Hyderabad
Hyderabad Bus Fire Accident : హైదరాబాద్ కూకట్ పల్లిలో పెను ప్రమాదం తప్పింది. కూకట్ పల్లి వై జంక్షన్ సమీపంలోని హెచ్ పీ పెట్రోల్ బంక్ వద్ద ఒక్కసారిగా ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. ప్రయాణికులను కిందకు దించేశాడు. బస్సు ఇంజిన్ నుంచి భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనతో పరుగులు పెట్టారు.
ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్గమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా బాలానగర్ నుంచి వాహనాలు నిలిచిపోవడంతో కాసేపు అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.