Fire Breaks: ఆక్సిజన్ ట్యాంకర్లను తరలిస్తున్న రైలులో మంటలు

ఆక్సిజన్ ట్యాంకర్లను తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకోగా.. రైలు హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌‌లోని రాయ్‌‌పూర్‌‌కు వెళ్తోండగా మంటలు రావడాన్ని సిబ్బంది గమనించారు.

Fire Breaks

Peddapalli Oxygen Train: ఆక్సిజన్ ట్యాంకర్లను తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకోగా.. రైలు హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌‌లోని రాయ్‌‌పూర్‌‌కు వెళ్తోండగా మంటలు రావడాన్ని సిబ్బంది గమనించారు. పెద్దపల్లి సమీపంలోని చీకురాయి గేటు వద్ద రైలును నిలిపివేసి ఫైర్ సిబ్బంది, పోలీసులు కలసి మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు.

ఈ ప్రమాదంలో ఒక ఆక్సిజన్ ట్యాంకర్ కాలిపోగా.. రైల్వే సిబ్బంది వేగంగా స్పందించడంతో ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు వెల్లడించారు. మంటలు అంటుకున్న ట్యాంకర్‌ నుంచి మిగతా వాటిని విడదీసి, దూరంగా తరలించి మంటలను ఆర్పివేశారు.

మంటలు చెలరేగిన ట్యాంకర్‌పై విద్యుత్‌ లైన్‌ ఉండగా రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. బ్రేక్‌ వేసిన సమయంలో మంటలు వచ్చి ఉంటాయని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు.