Secunderabad Fire Accident: షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం.. స్వప్నలోక్ అగ్ని ప్రమాదంపై ఫైర్ డీజీ

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లనే సంభవించిందని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి అన్నారు. కాంప్లెక్స్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉన్నప్పటికీ అవి పని చేయడం లేదని చెప్పారు.

Secunderabad Fire Accident : సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం విధితమే. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. 5వ ఫ్లోర్‌లో స్పృహ లేకుండా పడి‌ఉన్న ఆరుగురిని అగ్నిమాపక సిబ్బంది గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరుగురు మరణించారు. నిత్యం ఈ కాంప్లెక్స్ రద్దీగా ఉంటుంది. గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవటంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకున్నారు. భవనంలో చిక్కుకున్న 12 మందిని రక్షించారు. అయితే, ఆరుగు ఒకే గదిలో ఇరుక్కుపోవటం, దట్టమైన పొగకారణంగా ఊపిరాడక మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

Secunderabad Fire Accident : సికింద్రాబాద్ స్వప్నలోక్ అగ్నిప్రమాదంలో తీవ్ర విషాదం.. ఆరుగురు మృతి

స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం ఘటనపై అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి ఆరా తీశారు. కాంప్లెక్స్‌కు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. కాంప్లెక్స్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉన్నప్పటికీ అవి పని చేయడం లేదని, ఈ ఘటనలో షాపు కీపర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. గురువారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఫైర్ ఆఫీస్‌కి కాల్స్ వచ్చిందని, వెంటనే ఫైర్ సిబ్బంది ఘటన స్థలికి వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారని తెలిపారు. కాంప్లెక్స్‌లోని ఐదవ అంతస్తు పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. ప్రమాద సమయంలో 12 మందిని రెస్క్యు చేసి కాపాడటం జరిగిందని తెలిపారు.

Secunderabad Fire Accident : సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన.. భవనం కూల్చివేత పనులు వాయిదా, పూర్తిగా శిథిలాలు తొలగించాకే..

ఆరుగురు పొగ బాగా వ్యాపించడంతో ఊపిరాడక మృతిచెందారని తెలిపారు. ఫైర్ సేప్టీ నిబంధనలపై అనేక సమీక్షలు నిర్వహించామని, ప్రతీఒక్కరు ఫైర్ సేప్టీ నిబంధనలు పాటించాలని నాగిరెడ్డి సూచించారు. ఫైర్ సేప్టీ పెట్టుకుంటే సరిపోదని, వాటి నిర్వహణ సరిగా ఉంచుకోవాలని, కమర్షియల్ కాంప్లెక్స్‌లు లాక్ చేయకూడదని చెప్పారు. ప్రతి కాంప్లెక్స్ లో లిఫ్ట్ తో సహా మెట్లదారి కూడా తెరిచి ఉంచాలని నాగిరెడ్డి తెలిపారు. ఏ కాంప్లెక్స్ లోనైనా మెట్ల దారి లాక్ చేస్తే 101కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.

ట్రెండింగ్ వార్తలు