Charminar Fire Incident : హైదరాబాద్ చార్మినార్ దగ్గర అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చార్మినార్ దగ్గర డీజే సౌండ్ సిస్టమ్ లో మంటలు చెలరేగాయి. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఆల్ ఇండియా సున్నీ యునైటైడ్ ఫోరమ్ ఆధ్వర్యంలో రాల్యీ నిర్వహించారు.
Also Read : రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును కాంగ్రెస్ నేతలు కూడా వ్యతిరేకించారా? కారణం అదేనా..
కొంతమంది టపాసాలు కాల్చడంతో నిప్పురవ్వలు డీజే సౌండ్ సిస్టమ్ పై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగింది. మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ప్రమాదంతో స్థానికులు కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ఊపిరిపీల్చుకున్నారు.