Mrigasira karthi fish : మృగశిర వచ్చింది .. కొరమీను ధర కొండెక్కింది..

ఎండలు మండించే రోహిణి కార్తె వెళ్లింది. చిరుజల్లులతో వాతావరణాన్ని చల్లబరిచే మృగశిర కార్తె వచ్చింది. దీంతో కొర్రమీను చేప ధర కొండెక్కింది.

Mrigasira karthi koramenu fish

Mrigasira karthi fish dimand : ఎండలు మండించే రోహిణి కార్తె వెళ్లింది. చిరుజల్లులతో వాతావరణాన్ని చల్లబరిచే మృగశిర కార్తె వచ్చింది. దీంతో కొర్రమీను చేప ధర కొండెక్కింది. మృగశిర కార్తె ప్రారంభంలో మరి ముఖ్యంగా మొదటి మూడు రోజులు కొర్రమీను చేపలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. దీంతో ధరలు కొండెక్కుతాయి. ఎంత ధర అయినా సరే పెట్టి కొంటారు జనాలు. మిగిలిన తెల్ల చేపల కంటే సాధారణంగానే కొర్రమీను ధర ఎక్కువగా ఉంటుంది. ఇక మృగశిర కార్తె వచ్చిందంటే ఈ ధర రెట్టింపు అవుతుంది. దీంతో కొర్రమీను చేపలకు హైదరాబాద్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది.

 

మృగశిర కార్తె ప్రారంభం రోజున కొనుకునే వీలుంటే మరో మూడు రోజులు కొర్రమీను చేపలు తింటే మంచిదనే కారణంతో కారణంతో తెల్లవారుజాము నుంచే జనం చేపల మార్కెట్లకు పోటెత్తారు. దాదాపు అందరు కొర్రమీను చేపలే కొంటుంటారు. దీంతో వాటి ధరలకు రెక్కలొచ్చాయి. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే దాదాపు 3 లక్షల కిలోల చేపల విక్రయాలు జరిగినట్టు తెలుస్తోంది. ధరలతో సంబంధం లేకుండా కొర్రమీను చేప దక్కితే చాలన్నట్లుగా పోటీలు పడి మరీ కొనేస్తుంటారు. ఫలితంగా సాధారణ రోజుల్లో రూ. 320-400 మధ్య ఉండే కొరమీను చేప ధర నేడు రూ. 500 నుంచి రూ. రూ.1000 వరకు పలుకుతుంది. బొచ్చ, శీలావతి,రవ్వ,బొమ్మిడాయిలు వంటి పలు రకాల చేపల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. ఇక కొర్రమీను ధర గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.

Fish Prasadam : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ

 

మృగశిర కార్తెలో చేపలు ఎందుకు తినాలి?..
మృగశిర కార్తెతో వాతావరణం చల్లబడతుంది.అప్పటివరకు రోహిణి కార్తె ఎండలకు మాడిపోయిన జనాలు మృగశిర రాగానే వాతావరణం చల్లబడటంతో ఉపశమనం కలుగుతుంది. అప్పటి వరకు ఎండను తట్టుకున్న శరీరం ఒక్కసారిగా చల్లబడిన వాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది. అదే సయంలో వాతావరణంలో వచ్చిన మార్పులకు శరీరం అలవాటు పడే క్రమంలో పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. చేపలు శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోకుండా చేస్తాయి. ముఖ్యంగా కొర్రమీను చేపలో అటువంటి గుణాలు ఉంటాయని మగశిర కార్తె మొదటి రోజున తరువాత రెండు రోజులు కొర్రమీను తింటుంటారు. ఈ చేపలు తినటం వల్ల శరీరం సాధారణ స్థితికి తీసుకొచ్చి అనారోగ్యం పాలుకాకుండా కాపాడతాయి. మృగశిర కార్తె తొలి రోజున చేపలు తినాలని చెప్పడం వెనక ఉన్న కారణం ఇదేనంటారు. మరి ముఖ్యంగా గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు కొర్రమీను చేపల వల్ల ఉపశమనం కలుగుతుంది.

 

బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణి..
కాగా మృగశిర కార్తె ప్రారంభంలోనే బత్తిని సోదరులు ఆస్తమా రోగులకు చేప మందు పంపిణీ చేస్తారు. హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ చేప మందు పంపిణీ ప్రతీ ఏటా జరుగుతుంది. ఈ చేప మందును తీసుకోవడానికి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తారు. కొర్రమీను చేపపిల్ల నోట్లో బత్తిన సోదరులు తయారు చేసిన మందు పెట్టి వేస్తారు. ఈ మందు వల్ల ఆస్తమా నుంచి ఉపశమనం కలుగుతుందంటారు. ఈ చేపప్రసాదం పంపిణి కోసం డిమాండ్ కు తగినన్ని కొర్రమీను చేపపిల్లల్ని ప్రభుత్వమే సరఫరా చేస్తుంది.







                                    

ట్రెండింగ్ వార్తలు