Nagarjuna Sagar Dam : నాగార్జునసాగర్ ప్రాజెక్టులో పెరుగుతున్న వరదనీరు

నల్గోండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. గత మూడు రోజుల నుంచి ఎగువన కురుస్తున్న వర్షాలతో సాగర్ కు వరద నీరు వస్తోంది.

Nagarjuna Sagar Dam : నల్గోండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. గత మూడు రోజుల నుంచి ఎగువన కురుస్తున్న వర్షాలతో సాగర్ కు వరద నీరు వస్తోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అఢుగులు కాగా ప్రస్తుతం 529.40 అఢుగుల మేర నీరు నిల్వ ఉంది. సాగర్ పూర్తిస్ధాయి నీటి సామర్ధ్యం 312 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 166.9784 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 5,464 క్యూసెక్కులు కాగా. అవుట్ ఫ్లో 959 క్యూసెక్కులుగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు