Essential Goods Prices: సామాన్యుడికి మళ్లీ షాక్.. మళ్లీ మొదలైన ధరల మంట.. ఏయే వస్తువుల ధరలు పెరుగుతున్నాయంటే?

దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో సామాన్య వినియోగదారులకు ధరల మంట(Essential Goods Prices) తప్పేలా లేదు.

fmcg companies to raise essential goods prices ahead of festive season

  • నిత్యావసరాల ధరలు మళ్లీ పెంపు
  • పండుగల వేళ జేబుపై భారం
  • ముడిసరుకుల వ్యయం పెరగడమే కారణం

Essential Goods Prices: దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో సామాన్య వినియోగదారులకు ధరల మంట తప్పేలా లేదు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలు(Essential Goods Prices) విపరీతంగా పెరుగుతున్నాయి. దీనివల్ల ఉత్పత్తి వ్యయం భారం కావడంతో భారతీయ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (FMCG) కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సమాయత్తమవుతున్నాయి. నిత్యం ఉపయోగించే టూత్‌పేస్ట్, సోప్‌లు, డిటర్జెంట్లు, పాల ఉత్పత్తుల నుంచి పెయింట్లు, టైర్ల వరకు పలు రకాల వస్తువుల ధరలు త్వరలోనే పెరగనున్నాయి.

Peru Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన పర్యాటక విమానం.. 13 మంది మృతి

ముడిసరుకుల లభ్యత తగ్గింపు – కంపెనీల ధరల పెంపు నిర్ణయం:

ఇరాన్-అమెరికా తదితర ప్రాంతాల యుద్ధ ప్రభావంతో ఇంధన రవాణా ఖర్చులు, క్రూడ్ ఆయిల్ ఆధారిత ముడిసరుకుల వ్యయం భారీగా పెరిగింది. దీంతో ప్రముఖ కంపెనీలైన హిందుస్థాన్ యునిలీవర్ (HUL), దొడ్ల డెయిరీ, ఏషియన్ పెయింట్స్, హావెల్స్ మరియు టాటా వంటి సంస్థలు ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. హావెల్స్ ఎలక్ట్రికల్ వస్తువులపై 8 శాతం వరకు, టాటా ఉప్పుపై 7 శాతం మేర ధరలను పెంచగా, ఇతర నిత్యావసర ఉత్పత్తులు కూడా వరుసగా ప్రియం కానున్నాయి. రాబోయే దీపావళి సీజన్‌లో అమ్మకాలు ఊపందుకునే సమయంలో ఈ పెంపు వినియోగదారుల జేబులపై తీవ్ర ప్రభావం చూపనుంది.

ద్రవ్యోల్బణ ప్రభావం – ఆర్బీఐ, ప్రభుత్వ నిఘా:

రుణ వ్యవస్థ, నిత్యావసరాల ధరలను స్థిరీకరించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇంధన ధరలతో పాటు వర్షపాతంలో తేడాలు రావడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగితే తప్ప వడ్డీ రేట్లలో మార్పులు చేయబోమని సూచిస్తున్న ఆర్బీఐ, ప్రస్తుతం కీలక రేట్లను యథాతథంగా ఉంచే ఆలోచనలోనే ఉంది. భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గకపోతే భవిష్యత్తులో సామాన్యుడిపై ఆర్థిక భారం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.