Telangana Politics: బండి సంజయ్‭ని అధ్యక్షుడిగా తొలగించడాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగిన అనుచరుడు

మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన అజయ్ వర్మను వెంటనే కరీంనగర్ లోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. అతడి వెంట కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉన్నారు.

Karimnagar: భారతీయ జనతా పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడిగా బండి సంజయ్‭ను తప్పించడాన్ని జీర్ణించుకోలేక గత కొద్దిరోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన సొల్లు అజయ్ వర్మ అనే కార్యకర్త తాజాగా పురుగుల మందు తాగాడు. బండి సంజయ్‭కు జరుగుతున్న అన్యాయాన్ని, ఆయనకు జరుగుతున్న అవమానాలను తట్టుకోలేక పోతున్నానంటూ పురుగుల మందు తాగక ముందు అజయ్ వర్మ బాగా రోదించాడు.

AP High Court : ఏపీ హైకోర్టు తరలింపు ప్రతిపాదనేదీ పెండింగ్ లో లేదు : కేంద్ర న్యాయశాఖ

మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన అజయ్ వర్మను వెంటనే కరీంనగర్ లోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. అతడి వెంట కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉన్నారు. ప్రస్తుతం అజయ్ పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

Vikram Goud : గోషామహల్ సీటు నాదే.. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తా : విక్రమ్ గౌడ్

ఇదిలా ఉంటే.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, మురళీధర్ రావు, ప్రకాశ్ జావడేకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్, ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, తరుణ్ చుగ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు