Konijeti Rosaiah: గాంధీ భవన్‌కి రోశయ్య పార్థివదేహం.. నేడే అంత్యక్రియలు

కొణిజేటి రోశయ్య పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం(5 డిసెంబర్ 2021) ఉదయం 10 గంటల నుంచి గాంధీభవన్‌లో ఉంచనున్నారు.

Rosaiah

Konijeti Rosaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజకీయ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం(5 డిసెంబర్ 2021) ఉదయం 10 గంటల నుంచి గాంధీభవన్‌లో ఉంచనున్నారు.

అక్కడి నుంచి దేవరయాంజల్‌లోని వ్యవసాయ క్షేత్రానికి తరలిస్తారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రంగారెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్లకు ఈమేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించగా.. అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా శనివారం నుంచి సోమవారం వరకు సంతాప దినాలుగా పాటిస్తున్నట్లు వెల్లడించింది.

ప్రస్తుతం ఆయన భౌతికకాయం అమీర్‌పేట్‌లోని రోశయ్య స్వగృహంలో ఉంది. ఆయనకు భార్య శివలక్ష్మి, ముగ్గురు కుమారులు శివ సుబ్బారావు, త్రివిక్రమరావు, శ్రీమన్నారాయణమూర్తి, కుమార్తె రమాదేవి ఉన్నారు.

RGV: ‘సిరివెన్నెలకి ఓ ముద్దు’.. పాట పాడిన రామ్‌గోపాల్ వర్మ