Hyderabad : పబ్బులో ఘర్షణ, ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కుమారుడికి గాయాలు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ పబ్బులో గ్రూపుల మధ్య గొడవలో ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు గాయాలయ్యాయి.

Gautam Sawang son injured in pub fight

Hyderabad pub : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ పబ్బులో గ్రూపుల మధ్య గొడవ తలెత్తింది. అదికాస్తా ఘర్షణకు దారి తీసింది. రెండు గ్రూపులో కొట్టుకున్నాయి. ఈ ఘర్షణలో ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ కూడా ఉన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉ్న 040 పబ్బులో బుధవారం (సెప్టెంబర్ 13,2023) రాత్రి రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

వీరిలో ఒక గ్రూపు ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ ది కాగా మరో గ్రూపు సిద్ధార్థ్ మాగ్నమ్ అనే వ్యక్తిది. చిన్నపాటి గొడవకాస్తా ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ గ్రూపు సిద్ధార్థ్ పై దాడి చేయగా సిద్ధార్థ్ గ్రూపు డేవిడ్ సవాంగ్ గ్రూపుపై దాడి చేసింది. ఈ దాడిలో డేవింగ్ సవాంగ్ తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అలాగే సిద్ధార్థ, డేవిడ్‌కు కూడా గాయాలయ్యాయి. పబ్బులో గొడవ జరుగుతోందనే సమాచారంతో ఘటనా స్థలానికి పోలీుసులు వచ్చారు.కానీ అప్పటికే రెండు గ్రూపులవారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అనంతరం డేవింగ్ సవాంగ్ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా..పబ్బులో ఈ రెండు గ్రూపుల మధ్య ఘర్షణకు కారణం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.