Smita Sabharwal : స్మితా సబర్వాల్ ఆరు నెలలు లీవ్.. కారణం ఇదే.. ఆసక్తికర ట్వీట్..

Smita Sabharwal : తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ పెట్టారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు సెలవులు

Smita Sabharwal : స్మితా సబర్వాల్ ఆరు నెలలు లీవ్.. కారణం ఇదే.. ఆసక్తికర ట్వీట్..

Smita Sabharwal

Updated On : August 29, 2025 / 10:40 AM IST

Smita Sabharwal : తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ పెట్టారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు సెలవులు తీసుకున్నారు. కాగా స్మితా సబర్వాల్ (Smita Sabharwal) స్థానంలో ఐఏఎస్ కాత్యాయనీ దేవికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read: School Holidays : భారీ వర్షాల ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు..

సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఆరు నెలల చైల్డ్ కేర్ లీవ్ తీసుకున్నారు. ఆమె అభ్యర్థన మేరకు ప్రభుత్వం లీవ్‌ను మంజూరు చేసింది. గత ప్రభుత్వంలో సీఎంఓ అడిషనల్ సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్.. కాళేశ్వరం ప్రాజెక్టు సహా పలు కీలక అంశాల్లో ముఖ్యపాత్ర పోషించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో స్మితా సబర్వాల్‌పై కూడా చర్యలకు సిఫార్సు చేసింది. కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించబోతున్న నేపథ్యంలో ఆమె సెలవు తీసుకోవడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.


స్మితా సబర్వాల్ సెలవు జీవో మంజూరు తరువాత తన అధికారిక ట్వీటర్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘గత కొన్ని నెలలుగా ఆరోగ్యపరంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ వస్తున్నా. వెన్నుపూస నరం చీలికతో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాను. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నాను. కొన్నిసార్లు మన జీవితంలో నిశబ్దమైన సమయమే.. అసలైన పరిస్థితులను తెలియజేస్తాయి’’ అంటూ పేర్కొన్నారు.