నళిని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫొటో
Nalini: రాష్ట్ర ప్రజలకు మాజీ డీఎస్పీ నళిని వీలునామా/మరణ వాంగ్మూలం పేరిట ఓ బహిరంగ లేఖ రాశారు. ఒక అధికారినిగా, ఉద్యమకారినిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మిక వేత్తగా సాగిన తన జీవితం ముగియబోతోందని చెప్పారు.
“నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్‌గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్‌లో ఉన్నాను. మూడు రోజుల నుంచి నాకు నిద్ర లేదు. రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను. నా గతమంతా వ్యధా భరితం.
తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయ్యాయి. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహంలో నుంచి బయట పడితే, డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బల్లాన్ని కసి తీరా దింపింది.
ఇలాంటి తరుణంలో నేటి సీఎం అధికారంలోకి రాగానే నా ఫైల్‌ను ఎందుకో తెరిచారు. నాకేదో సాయం చేస్తానని ప్రకటన చేశారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. ఆరు నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్త బుట్ట పాలైంది అని తెలిసింది.
నా అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి. బతికుండగా నన్ను పట్టించుకోని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు. ఒకవేళ నా ఈ ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఎవరో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితే, నాకు సరైన, ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడతాను.
బతికుండగా దేశ ప్రధానిని కలవలేక పోయాను. ఆయన కరుణామయుడు. నా మరణానంతరం నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్లీ జన్మలో కొనసాగిస్తాను” అని తెలిపారు.
నళిని చేసిన పోస్ట్ ఇదే..