Harish Rao Comments
Harish Rao Comments : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. సీఎం పదవిని దిగజారే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చకపోతే 5 ఏళ్ల తర్వాత జనమే తిరగపడతారని విమర్శించారు. తెలంగాణ ప్రజలే నిన్ను దించుతారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. సోమవారం ఆయన మెదక్ జిల్లా తూప్రా మండలం వెంకటాయపల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Read Also : YCP: 14వ వసంతంలోకి వైసీపీ.. ఈ ప్రయాణమే ఓ సెన్సేషన్
కేసీఆర్ 14ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించారు :
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ స్ఫూర్తితో కేసీఆర్ 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించారని చెప్పారు. కేసీఆర్ శివాజీ బాటలో పది సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించారన్నారు. సీఎం రేవంత్ చెప్పిందేమో కొండంత చేస్తుందేమో గోరంత, మాటలు ఎక్కువ చేతలు తక్కువగా అంటూ ఎద్దేవా చేశారు.
రేవంత్ మాట్లాడే అబద్ధాలు ఆకాశాన్ని అంటుతున్నాయని, చేసింది మాత్రం ఏదీ లేదని మాజీ మంత్రి విమర్శలు గుప్పించారు. రేవంత్ మాట్లాడే చాలా హీనంగా ఉందని, ఒక ముఖ్యమంత్రి లాగా మాట్లాడడం లేదని మండిపడ్డారు. విజ్ఞతతో పాలన చేయాలని సూచించారు.
హామీలు ఏమయ్యాయి? అంటూ సూటి ప్రశ్న:
డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న హామీ ఏమైంది? ఎందుకు చేయాలేదో చెప్పాలని ప్రశ్నించారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు ఎక్కడ పోయాయన్నారు. తెలగాణంలోని అక్కచెల్లెళ్లకు ఇస్తానన్న రూ. 2500 ఎక్కడపోయాయి, అవ్వ తాతలకు ఇచ్చే 4 వేల పెన్షన్ ఎక్కడ? అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.
Read Also : BRS Leaders Migration : కారు పార్టీలో కలకలం.. బీఆర్ఎస్‌లో వలసలకు కారణం ఏంటి?