YCP: 14వ వసంతంలోకి వైసీపీ.. ఈ ప్రయాణమే ఓ సెన్సేషన్

వైఎస్‌ జగన్‌కు.. 2019లో జనం తిరుగులేని మెజార్టీ ఇచ్చి పట్టం కట్టారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా

YCP: 14వ వసంతంలోకి వైసీపీ.. ఈ ప్రయాణమే ఓ సెన్సేషన్

YSRCP

ఏపీ చరిత్రలో వైసీపీ పార్టీ ఒక ఎమోషన్. ఒక సెన్సేషన్. ఒక్కడితో మొదలై.. కోట్ల మంది కార్యకర్తల సమూహంగా మారింది వైసీపీ. కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చినప్పుడు.. వైసీపీ జెండా ఎత్తినప్పుడు అతనొక్కడే. అతడే ఎజెండా.. అతడే నినాదంగా మొదలైన వైసీపీ ఇంతింతై ఎదిగింది. పార్టీ పెట్టిన తొమ్మిదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. అయినా ఎక్కడా భయపడలేదు. వెనక్కి తగ్గలేదు. కలిసి వచ్చినవాళ్లను కలుపుకుని.. వెంట నడిచినవాళ్లను చేతిన పట్టుకుని ముందుకు నడిచారు సీఎం వైఎస్ జగన్.

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ 14వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో జగన్ వెంట నడిచిన కుటుంబాలెన్నో.  2010, నవంబర్ 29న జగన్ కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు జగన్. వైఎస్సార్ ఆశయాల సాధనే ధ్యేయంగా 2011, మార్చి 12న  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించింది.

ఈ 13 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లు, కష్టాలను ఎదుర్కొని పార్టీని నడిపించారు జగన్. పార్టీ పెట్టినప్పుడు జగన్ తో కలిసి నడిచేందుకు పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇక నాటి నుంచి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీని ముందుకు నడిపించిన వైఎస్‌ జగన్‌ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎట్టకేలకు అధికారం చేపట్టారు.

వైఎస్‌ జగన్‌కు.. 2019లో జనం తిరుగులేని మెజార్టీ ఇచ్చి పట్టం కట్టారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో.. 151 ఎమ్మెల్యేలు, 22 లోక్ సభ సీట్లను గెలుచుకుని ప్రభంజనం సృష్టించింది వైసీపీ.

ఈసారి అంతకు మించి 175కు 175 స్థానాలు కొట్టాలనే టార్గెట్ తో ముందుకు వెళ్తుంది వైసీపీ. తమ రికార్డును తామే బద్దలు కొడతామని.. వై నాట్ 175 అంటూ టార్గెట్ ను పెట్టుకుంది. అంతే కాకుండా గడచిన రెండు నెలలుగా సిద్దం సభలతో పార్టీలో జోష్ మరింతగా పెరిగింది. పార్టీ క్యాడర్‌ను ఎన్నికలను సిద్దం చేయడానికి రాష్ట్రంలో నాలుగు రీజనల్ సభలు నిర్వహించి ఉత్సాహాన్ని నింపింది వైసీపీ.

CAA : మోదీ సర్కారు సంచలన నిర్ణయం.. సీఏఏ అమలుకు నోటిఫికేషన్ జారీ