L.Ramana-TRS : గులాబీ తీర్ధం పుచ్చుకోనున్న రమణ

టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇందుకోసం తెలంగాణ భవన్‌లో సభను ఏర్పాటు చేశారు.

L Ramana to join TRS today : టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ శుక్రవారం (జూలై 16) టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇందుకోసం తెలంగాణ భవన్‌లో సభను ఏర్పాటు చేశారు. ఇందులో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మంత్రులు, చేనేత సంఘాల నేతలు పాల్గొననున్నారు. కాసేపట్లో రమణ తన నివాసంలో అభిమానులు, నేతలతో సమావేశమై ఊరేగింపుగా బయల్దేరతారు.

మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్కు వద్ద అమరవీరులకు నివాళి అర్పించి అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కారు ఎక్కనున్నారు. జులై 8న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఎల్.రమణ భేటీ అవ్వగా.. టీఆర్ఎస్‌లోకి రావాలసిందిగా కేసీఆర్ ఆయన్ను ఆహ్వానించారు. పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇఛ్చారు.

ఆ భేటీ జరిగిన మరుసటి రోజే టీడీపీకి గుడ్‌బై చెప్పారు రమణ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రమణకు మంచి పట్టుకుంది. ఇక టీఆర్ఎస్ పార్టీకి ఈటలరాజేందర్ రాజీనామా చేయడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసే బలమైన బీసీ నాయకుడి కోసం సీఎం కేసీఆర్ అన్వేసిస్తున్నారు. ఈ క్రమంలోనే రమణ వైపు కేసీఆర్ మొగ్గుచూపారు. అంతేకాదు అవసరమైతే హుజురాబాద్ ఎన్నికల్లో ఈటలకు పోటిగా రమణనే బరిలోకి దింపాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు