×
Ad

Cyber Criminals : సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి.. రూ. కోటిన్నర పోగొట్టుకున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్

సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మిన మహిళా పెట్టుబడి కింద డబ్బులు చెల్లించారు. అలా విడతలవారీగా రూ.1.50 కోట్లను సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నారు.

  • Published On : June 13, 2023 / 11:03 AM IST

Cyber Fraud

woman software : సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కోటిన్నర రూపాయలు పోగొట్టుకున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో తాము సూచించిన పేజీలకు రేటింగ్ ఇస్తే కమీషన్ల రూపంలో డబ్బులు ఇస్తామని హైదరాబాద్ కు చెందిన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు సైబర్ నేరగాళ్లు ఆశ చూపారు.

అది నమ్మిన మహిళా సాఫ్ట్ వేర్ కు తొలుత కొంత నగదు చెల్లించి నమ్మించారు. ఆ తర్వాత తమతోపాటు పెట్టుబడి పెడితే బోలెడంత బబ్బు సంపాదించుకోవచ్చని నమ్మ బలికారు. సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మిన మహిళా పెట్టుబడి కింద డబ్బులు చెల్లించారు.

BiparJoy Cyclone : గుజరాత్ కచ్ తీరం వైపు దూసుకొస్తున్న బిపోర్ జాయ్ తుఫాను

అలా విడతలవారీగా రూ.1.50 కోట్లను సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నారు. ఆ తర్వాత మోసపోయానని తెలుసుకున్న మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు.