Peddapalli : పెద్దపల్లి మార్కెట్‌లో ఫ్రీగా కూరగాయలు.. అసలు విషయం ఏమిటంటే?

ఒప్పందం ప్రకారం హోల్ సెల్ వ్యాపారులు రిటెయిల్ గా కూరగాయలు విక్రయించొద్దని నిబంధన ఉంది. కానీ, వారు నిబంధనలు అతిక్రమించి కిలోల చొప్పున కూరగాయలు రోజు మొత్తం అమ్ముతుండటంతో రిటెయిల్

Free Vegetables

peddapalli : పెద్దపల్లి మార్కెట్ లో కూరగాయాలను ఉచితంగా అందజేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఉచిత కూరగాయలకోసం భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. ఇంతకీ కూరగాయలు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారని ఆరా తీస్తే.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫ్రీగా కూరగాయలు ఇస్తుంది రిటెయిల్ వ్యాపారులు. గతకొద్దిరోజులుగా పెద్దపల్లి కూరగాయల మార్కెట్ లో హోల్ సెల్ అండ్ రిటెయిల్ కూరగాయల వ్యాపారస్తులకు మధ్య వివాదం నడుస్తుంది.

Also Read : ముందు రాము, ఆ తర్వాత రెమో, ఇప్పుడేమో అపరిచితుడు..! పూటకో మాట మాట్లాడుతున్న సంజయ్ రాయ్

ఒప్పందం ప్రకారం హోల్ సెల్ వ్యాపారులు రిటెయిల్ గా కూరగాయలు విక్రయించొద్దని నిబంధన ఉంది. కానీ, వారు నిబంధనలు అతిక్రమించి కిలోల చొప్పున కూరగాయలు రోజుమొత్తం అమ్ముతుండటంతో రిటెయిల్ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో హోల్ సెల్ వ్యాపారస్తుల తీరుకు నిరసనగా.. కూరగాయల మార్కెట్ బంద్ చేసి వినియోగదారులకు రిటెయిల్ వ్యాపారస్తులు ఫ్రీగా కూరగాయలు అందిస్తున్నారు. హోల్ సెల్ వ్యాపారులు వినియోగదారులకు రిటెయిల్ గా కూరగాయలు విక్రయిస్తుండటంతో మేము తీవ్రంగా నష్టపోతున్నామని రిటెయిల్ వ్యాపారస్తుల ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు