×
Ad

10టీవీ ఎఫెక్ట్‌.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, రౌడీషీటర్ సూరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులు

సూరి పదేళ్ల వయసులోనే రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం శ్రీ రామ్ కాలనీకి వలస వెళ్లాడు. కారు డ్రైవర్ నుంచి మోస్ట్ వాంటెట్‌గా మారాడు.

Warangal Police: వరంగల్‌లో గన్ గ్యాంగ్‌పై సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉక్కు పాదం మోపుతున్నారు. గన్‌ కల్చర్‌పై ఇటీవల 10టీవీలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇవాళ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, రౌడీషీటర్ దాసరి సురేందర్ అలియాస్ సూరిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. అలాగే, గన్ గ్యాంగ్ ముఠా సభ్యులను కూడా మీడియా ముందుకు తీసుకురానున్నారు.

Also Read: నేటితో “వందేమాతరం” గేయానికి 150 ఏళ్లు పూర్తి.. దేశ వ్యాప్తంగా “వందేమాతరం” ఆలాపన.. ఢిల్లీలో మోదీ..

వరంగల్ కమిషనరేట్ ఆఫీస్‌లో ఈస్ట్ జోన్ డీసీపీ వివరాలు వెల్లడించనున్నారు. గన్ గ్యాంగ్ క్రిమినల్ దాసరి సురేందర్ అలియాస్ సూరిది వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామం. సూరి పదేళ్ల వయసులోనే రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం శ్రీ రామ్ కాలనీకి వలస వెళ్లాడు. కారు డ్రైవర్ నుంచి మోస్ట్ వాంటెట్‌గా మారాడు.

పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూరి హైదరాబాద్ సహా మరో నాలుగు జిల్లాల్లో దందాలు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ ఓ హత్య కోసం అతడి గ్యాంగ్‌ సుపారీ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు.