Gaddar
Hyderabad: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. హైదరాబాద్ లో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు హెచ్ఐసీసీలో జరిగాయి. మరికొద్ది సేపట్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ సభకు భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో పబ్లిక్ ఎంట్రీ గేట్ ల వద్ద జనాలు పెరుగుతున్నారు. పాస్ లు చెక్ చేసిన తర్వాతనే సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి పంపిస్తున్నారు. గేట్ నెంబర్ 3 వద్ద వీఐపీ పాస్ లు ఉన్న నేతలను అనుమతిస్తున్నారు. మరోవైపు పరేడ్ గ్రౌండ్ చుట్టూ ఎనిమిది పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.
Yadamma: నన్ను ఎవరూ అడ్డుకోలేదు.. ఆ వార్తలను ఖండించిన వంటల స్పెషలిస్ట్ యాదమ్మ
ఇదిలాఉంటే బీజేపీ బహిరంగ సభలో ప్రజాగాయకుడు గద్దర్ ప్రత్యక్షమయ్యారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభకు గద్దర్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మధ్యాహ్నం 3గంటల సమయంలో గద్దర్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ.. దేశం, తెలంగాణ గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఏం మాట్లాడతారో వినేందుకు తాను స్తంభాస్థలికి వచ్చినట్లు గద్దర్ తెలిపారు. ప్రధాని ప్రసంగం అనంతరం స్పందిస్తానని చెప్పారు. గద్దర్ బీజేపీ బహిరంగ సభకు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో రాహుల్ గాంధీ ప్రతిపక్షాల సభకు హాజరైన గద్దర్ నేడు మోదీ సభకు హాజరయ్యారు.
Today I am joining the Bharatiya Janata Party at the public meeting. pic.twitter.com/awj9kf34yW
— Konda Vishweshwar Reddy (@KVishReddy) July 3, 2022
మరోవైపు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరికొద్దిసేపట్లో బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. మరికొద్ది సేపట్లో పరేడ్ గ్రౌండ్ లో జరిగే బీజేపీ బహిరంగ సభలో నేను కాషాయ దళంలోకి చేరనున్నట్లు తెలిపారు.