Pulichintala Project : ఊడిపోయిన పులిచింతల ప్రాజెక్టు గేటు

పులిచింతల ప్రాజెక్టు 16వ నెంబర్ గేటు ఊడిపోయింది. తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతలో గేటు ఎత్తుతుండగా ఏపీ పరిధిలోని 16వ నెంబర్ గేటు సాంకేతిక సమస్య కారణంగా ఊడి నీటిలో పడిపోయింది.

Pulichintala project : పులిచింతల ప్రాజెక్టు 16వ నెంబర్ గేటు ఊడిపోయింది. తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతలో గేటు ఎత్తుతుండగా ఏపీ పరిధిలోని 16వ నెంబర్ గేటు సాంకేతిక సమస్య కారణంగా ఊడి నీటిలో పడిపోయింది. ఎగువ నుంచి ఇన్ ఫ్లో పెరగడంతో ఏపీ పరిధిలోని 16వ నెంబర్ గేటు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. సాంకేతిక సమస్యతో గేటు ఊడి నీటిలో పడిపోయింది.

ఎగువ నుంచి భారీగా ఇన్ ఫ్లో పెరుగుతుండటంతో ఒక్క 16 వ నెంబర్ గేటు ద్వారానే అదనంగా దిగువకు లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు రంగంలోకి దిగారు. ఎమర్జెన్సీ గేటు బిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం లోగా ఎమర్జెన్సీ గేటు బిగిస్తామని అధికారులు అంటున్నారు. గేటు ఊడటంతో ముందు జాగ్రత్తగా ప్రాజెక్టుపైకి రాకపోకలు నిలిపివేశారు.

పులిచింతలకు ప్రస్తుతం 2,12,992 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుతం 172.76 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 42.34 టీఎంసీల నిల్వ ఉంది.

ట్రెండింగ్ వార్తలు