కేటీఆర్‌ని ఇంటర్వ్యూ చేసిన ఘంటా చక్రపాణి.. ఏమేం చెప్పారో తెలుసా?

KTR: బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి..

భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఇంటర్వ్యూలో చేశారు. దేశ ప్రజలందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నానని కేటీఆర్ అన్నారు.

అంబేద్కర్ అందరివాడని, ఆయన స్థాయిని తగ్గించి, కొందరికి మాత్రమే పరిమితం చేసే ప్రయత్నాలు జరిగిన మాట వాస్తవమని చెప్పారు. అంబేద్కర్ జాతిపిత మహాత్మా గాంధీతో సమానమైన మహా నాయకుడని చెప్పారు. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ సాధ్యమైందని తెలిపారు.

అంబేద్కర్ సూచించిన బోధించు, సమీకరించు, పోరాడు అనే సూత్రం ఆధారంగానే తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించుకున్నామని చెప్పారు. దేశ రాజ్యాంగ పరిరక్షణ కోసం అవసరమైతే ఇతర పార్టీల నేతలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉత్తర, దక్షిణభారత దేశాల మధ్య వివక్ష వల్ల దేశ సమగ్రతకు భంగం కలిగే ప్రమాదం ఉందని చెప్పారు.

కవితను కలిసిన కేటీఆర్.. సోమవారం ముగియనున్న సీబీఐ కస్టడీ

ట్రెండింగ్ వార్తలు