GHMC Alert Rainy Issues : వర్షాకాలపు సమస్యలపై జోనల్ కమిషనర్లకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశం

జిహెచ్ఎంసి అన్ని సర్కిళ్లలో ఉన్న పురాతన భవనాలను గుర్తించి స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఎలా ఉందో సర్వే చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్ ఆదేశించారు.

GHMC Alert Rainy Season Issues : జిహెచ్ఎంసి అన్ని సర్కిళ్లలో ఉన్న పురాతన భవనాలను గుర్తించి స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఎలా ఉందో సర్వే చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్ ఆదేశించారు. పురాతన భవనాల్లో ప్రమాదకరంగా ఉన్న వాటిని గుర్తించి కూలడానికి సిద్ధంగా ఉన్న వాటిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కూల్చివేయాలని ఆదేశించారు.

వర్షాకాలం ముగిసేంత వరకు ఎలాంటి సెల్లార్ తవ్వకాలకు అనుమతి ఇవ్వవద్దని సూచించారు. నాలా రిటైనింగ్ వాల్ పనులను ఇంజినీరింగ్ అధికారులు జూన్ 15 వరకు పూర్తి చేయాలన్నారు. వెంటనే మన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌ను వాటర్ నిలిచిపోయే పాయింట్స్ వద్ద ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ప్రతి వార్డ్‌కు ఒక్క రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. వరదల వల్ల ఇబ్బంది అయితే వారిని తరలించడానికి బోట్లు ఏర్పటు చేయాలని లోకేష్ కుమార్ ఆదేశించారు. అపార్ట్ మెంటులో మోటార్ పంప్స్ ఉండేటట్లు చూసుకోవాలని కమీషనర్ సూచించారు. చెట్లు విరిగిపోయి రోడ్ల మీద పడితే వెంటనే తొలిగించేలా చూడాలని, ఒంగిపోయిన చెట్లు ఉంటే వాటిని వెంటనే తొలిగించాలని తెలిపారు.

తుప్పు పట్టిన లేదా ఒంగిపోయిన ఎలక్ట్రికల్ పోల్స్‌ను వెంటనే మార్చాలని పేర్కొన్నారు. నీళ్లు నిలిచిపోయే ప్రాంతాల్లో ఫాగ్గింగ్ చేయడంతోపాటు డెంగు, మలేరియా ప్రబలకుండా స్ప్రెయింగ్ చేయాలని జోనల్ కమిషనర్లకు లోకేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

ట్రెండింగ్ వార్తలు