GHMC fined To Let board : టు లెట్’ బోర్డుకు రూ.2 వేల జరిమానా

స్తంభానికి అంటించిన టు లెట్‌ పేపర్‌ కు సైతం జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగం మాత్రం రూ.2 వేల జరిమానా విధిస్తూ ఈ–చలాన్‌ జారీ చేసింది.

GHMC fined To Let board : హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తుంటారు. అలాగే అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తారు. హోర్డింగ్స్, బోర్డులను తొలగించడమే కాకుండా జరిమానా కూడా విధిస్తారు. ఈక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ‘టు లెట్’ బోర్డు కూడా జరిమానా విధించారు.

నగరంలోని స్తంభానికి అంటించిన టు లెట్‌ పేపర్‌ కు సైతం జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగం మాత్రం రూ.2 వేల జరిమానా విధిస్తూ ఈ–చలాన్‌ జారీ చేసింది. కూకట్‌పల్లిలోని దీన్ని ఈవీడీఎం సీఈసీ విభాగానికి పోస్ట్‌ చేస్తూ వీటివల్ల పోల్స్, గోడలు అంద వికారంగా మారుతున్నాయంటూ ఒక సొసైటీ ఫిర్యాదు చేయడంతో జరిమానా విధించారు.

అయితే జరిమానా విధించిన వ్యక్తి చిరునామా సైతం నగరంలో లేదు. సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం పాములపర్తి గ్రామంగా పేర్కొంటూ ఈవీడీఎం జరిమానా జారీ చేసింది.

అంతటితో ఆగని సదరు సొసైటీ అదే పిల్లర్‌పై ఉన్న ‘యాక్ట్‌ ఫైబర్‌నెట్‌’ సంగతేమిటని ప్రశ్నించింది. శనివారం రాత్రి 7.30 గంటల వరకు ఈవీడీఎం నుంచి తిరిగి ఎలాంటి ప్రతి స్పందన కనిపించకపోవడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు