×
Ad

GHMC: టీసీయూఆర్‌గా మారనున్న జీహెచ్ఎంసీ..!

ఢిల్లీలో ఇలాగే ఎన్సీఆర్ (నేషనల్ కేపిటల్ రీజియన్) ఉన్న విషయం తెలిసిందే. ఆ తరహాలోనే హైదరాబాద్‌లో టీసీయూఆర్ అధికారికంగా మారనున్నట్లు తెలుస్తోంది.

GHMC: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) అనే పేరు ఇక చరిత్రలో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆరు జోన్లు, 30 సర్కిళ్లతో ఉన్న జీహెచ్‌ఎంసీ త్వరలోనే తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (టీసీయూఆర్‌)గా మారనున్నట్లు తెలుస్తోంది.

దీనిపై సమగ్ర ప్రణాళిక త్వరలో వెలుపడే అవకాశముంది. అలాగే, టీసీయూఆర్‌ పరిధిలోని ప్రాంతాన్ని మూడు విభాగాలు విభజించే ప్రతిపాదన ఉంది. అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. (GHMC)

Also Read: రష్యా అధ్యక్షుడి సెక్యూరిటీ అంటే ఆషామాషీ కాదు.. పుతిన్‌ రాకముందే రష్యా టీమ్స్‌ వచ్చేసి.. పుతిన్‌ కోసం పోర్టబుల్‌ టాయిలెట్‌ కూడా..

ఢిల్లీలో ఇలాగే ఎన్సీఆర్ (నేషనల్ కేపిటల్ రీజియన్) ఉన్న విషయం తెలిసిందే. ఆ తరహాలోనే హైదరాబాద్‌లో టీసీయూఆర్ అధికారికంగా మారనుంది. జీహెచ్ఎంసీలో 27 మునిసిపల్ బాడీలను విలీనం చేసి, జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించే క్రమంలో అతి పెద్ద మహానగరంగా మారనుంది హైదరాబాద్.

దీంతో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా పేరు మార్పునకు మార్గం సుగమం చేసింది. ప్రభుత్వం మూడు ఆర్డినెన్సులను జారీ చేసి, అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో మునిసిపల్ చట్టంలో మార్పులు చేయనున్నట్లు సమాచారం. టీసీయూఆర్ హైదరాబాద్‌కు చట్టబద్ధత కల్పిస్తారు. దీంతో అధికారికంగా విలీన ప్రక్రియ పూర్తికానుంది.