Love : పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య
ప్రేమించిన యువకుడు మోసం చేశాడని మనస్తాపంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
- kunduru Vinod
- Published On : October 22, 2021 / 05:51 PM IST
Love (2)
Love : ప్రేమించిన యువకుడు మోసం చేశాడని మనస్తాపంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యువతి కుటుంబ సభ్యులు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మ జ్యోతి (34) కుటుంబ సభ్యులతో కలిసి శామీర్‌పేటలో నివాసం ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన యువకుడిని కొంతకాలంగా ప్రేమిస్తుంది జ్యోతి.. తననే పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులకు కూడా తెలిపింది.
చదవండి : Love : ప్రేమ వ్యవహారం.. ట్రైనీ ఐఏఎస్‌పై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదు
అయితే ఇటీవల ప్రియుడి ప్రవర్తనలో మార్పులు కనిపిస్తున్నాయని కుటుంబ సభ్యులకు చెప్పి వాపోయింది జ్యోతి.. పెళ్లి విషయం ఎత్తగానే మాట దాటేస్తున్నాడని వాపోయింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చెల్లి ఇంటికి వచ్చేసరికి జ్యోతి ఆమె తాడుకు వేలాడుతుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
చదవండి : Lovers : ఏకాంత ప్రదేశంలో ప్రియుడితో ఉన్న కూతురు.. తండ్రి కంట పడటంతో.. రోడ్డుపైనే ఇలా
