Love : ప్రేమ వ్యవహారం.. ట్రైనీ ఐఏఎస్‌పై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదు

ప్రేమించి పెళ్లికి ఒప్పుకోవడం లేదంటూ ట్రైనీ ఐఏఎస్‌పై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది ఓ యువతి. దీంతో పోలీసులు సదరు ట్రైనీ ఎస్ఐపై కేసు నమోదు చేశారు.

Love : ప్రేమ వ్యవహారం.. ట్రైనీ ఐఏఎస్‌పై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదు

Love

Updated On : October 21, 2021 / 7:37 PM IST

Love : ప్రేమించి పెళ్లికి ఒప్పుకోవడం లేదంటూ ట్రైనీ ఐఏఎస్‌పై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది ఓ యువతి. దీంతో పోలీసులు సదరు ట్రైనీ ఎస్ఐపై కేసు నమోదు చేశారు. యువతి ఫిర్యాదును ఓ సారి పరిశీలిస్తే.. ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ కుమారుడు మృగేందర్‌లాల్‌.. ప్రస్తుతం మృగేందర్‌లాల్‌ మదురైలో ట్రైనీ ఐఏఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు. యువతికి కొంతకాలం క్రితం మృగేందర్‌లాల్‌‌తో ఫేస్‌బుక్ పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కొంతకాలానికి ప్రేమగా మారింది.

చదవండి : Janhvi Kapoor: అందాల నెరజాణ జాన్వీ.. తెలుగులో భాగ్యమెప్పుడో?

అయితే ప్రేమించిన మృగేందర్‌లాల్‌ ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకోవడం లేదని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. అతడి కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారని.. రూ.25 లక్షలు డబ్బు ఆశచూపారని ఫిర్యాదులో పేర్కొంది. కాగా గత నెల 27న కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ట్రైనీ ఐఏఎస్‌ పై కేసు నమోదు కాగా.. ఆలస్యంగా ఈఘటన వెలుగులోకి వచ్చింది.

చదవండి : China’s Covid Cases : చైనాలో మళ్లీ కోవిడ్ కలకలం..విమానాలు రద్దు,స్కూల్స్ బంద్