Janhvi Kapoor: అందాల నెరజాణ జాన్వీ.. తెలుగులో భాగ్యమెప్పుడో?
అతిలోక సుందరి స్వర్గీయ శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ చేసిన సినిమాల సంగతెలా ఉన్నా క్రేజ్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. ఇప్పటికే ఈ చిన్నది బాలీవుడ్ లో నాలుగైదు సినిమాలలో నటించినా..

Janhvi Kapoor: అతిలోక సుందరి స్వర్గీయ శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ చేసిన సినిమాల సంగతెలా ఉన్నా క్రేజ్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. ఇప్పటికే ఈ చిన్నది బాలీవుడ్ లో నాలుగైదు సినిమాలలో నటించినా అనుకున్న స్థాయిలో అవి సక్సెస్ కాలేదు. ముఖ్యంగా ఎన్నో అంచనాల నడుమ వచ్చిన సైరాట్ రీమేక్ ధడక్ చిత్రం బోల్తా కొట్టగా.. ఆ తర్వాత వచ్చిన సినిమాల పరిస్థితి కూడా అంతే. అయితే, జాన్వీ కపూర్ అందాలు, నటనకు బాలీవుడ్ ఫిదా అయింది.
Radhe Shyam: ఇంగ్లీష్‌లో రాధేశ్యామ్ టీజర్.. గ్లోబల్ ప్రమోషన్ స్టార్ట్!
జాన్వీ కపూర్‌కు ఇంత వరకు కూడా ఒక్క కమర్షియల్ హిట్ రాలేదు కానీ.. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్ రేంజిలో ఉంటుంది. ఇక్కడ జాన్వీ చేసే అందాల విందు మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుంది. లంగావోణి, చీరకట్టు, మోడ్రన్స్ దుస్తులు, బికినీ ధరించినా డ్రెస్ ఏదైనా జాన్వీ అందరినీ ఆకట్టుకుంటుంది. అందుకే సక్సెస్ సినిమాలు లేకున్నా బాలీవుడ్ లో అమ్మడికి డిమాండ్ మాత్రం బాగానే ఉంది. ప్రస్తుతం జాన్వీ చేతిలో మూడు సినిమాలున్నాయి. ఇప్పటికే ఒక సినిమా కంప్లీట్ కాగా మరో రెండు షూటింగ్ లో ఉన్నాయి.
Bigg Boss 5: దారుణంగా పడిపోతున్న రేటింగ్.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఎప్పుడో?
అయితే, శ్రీదేవి వారసురాలిగా జాన్వీకి మన తెలుగు ప్రేక్షకులలో కూడా మాంచి ఫాలోయింగ్ ఉంది. జాన్వీ కూడా తెలుగు సినిమాపై ఫుల్ ఇంట్రస్ట్ ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్. అందుకే.. ఈ కపూర్ వారసురాలిని మన మేకర్స్ ఎప్పుడు తీసుకొస్తారా అని ఎదురుచూపులు ఎక్కువవుతున్నాయి. మహేష్, చరణ్, బన్నీ, ఎన్టీఆర్ ఇలా బడా హీరోల సినిమాలతోనే జాన్వీ తెలుగులో ఎంట్రీ ఉంటుందని ఎన్నో కథనాలు వచ్చినా అవేమీ నిజం కాలేదు.
Telugu Young Hero’s: ఒక్క బ్రేక్.. ఒక్క హిట్టు కావాలి ప్లీజ్!
కాగా, ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాతోనే ఫైనల్ గా జాన్వీ తెలుగు తెరకి అరంగేట్రం అవుతుందని బలంగా వినిపిస్తుంది. బన్నీ ఐకాన్ సినిమాలో కథానాయక ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. సారా అలీఖాన్, ఖుషీ కపూర్, అనన్య పాండే ఇలా చాలా పేర్లు వినిపించినా చివరికి జాన్వీని ఫైనల్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజు ఇప్పటికే జాన్వీని ఒప్పించగా త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉండనుందని చెప్తున్నారు. కుర్రాళ్ళ ఎదురుచూపులు ఫలించి ఇదైనా నిజమవుతుందో లేదో చూడాలి.
1Crime news: గ్యాస్ సిలీండర్ పేలి కూలిన ఇంటి పైకప్పు.. నలుగురు మృతి.. శిథిలాల కింద చిక్కుకొని..
2NTR : ఫిల్మ్‌నగర్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తరలి రానున్న ఎన్టీఆర్ కుటుంబం..
3Major : మేజర్ టికెట్ రేట్స్ చాలా తక్కువ.. సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న అడివి శేష్..
4NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మి పార్వతి
5NTR : ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
6Virender Sehwag: “ఆ మ్యాచ్‌లు ఆడకపోతే పంత్‌ను పట్టించుకోరు”
7CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
8RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
9IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్‌కు రాజస్తాన్
10Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
-
Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్‌వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్