China’s Covid Cases : చైనాలో మళ్లీ కోవిడ్ కలకలం..విమానాలు రద్దు,స్కూల్స్ బంద్

ప్రపంచంలోనే తొలిసారిగా కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చిన చైనాలో మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గడిచిన ఐదు రోజులుగా చైనాలోని ఉత్తర, వాయవ్య ప్రాంతాల్లో కొత్తగా కేసులు

China’s Covid Cases : చైనాలో మళ్లీ కోవిడ్ కలకలం..విమానాలు రద్దు,స్కూల్స్ బంద్

China (2)

China’s Covid Cases  ప్రపంచంలోనే తొలిసారిగా కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చిన చైనాలో మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గడిచిన ఐదు రోజులుగా చైనాలోని ఉత్తర, వాయవ్య ప్రాంతాల్లో కొత్తగా కేసులు వెలుగుచూస్తున్నాయి.

పర్యాటక బృందంలోని ఓ వృద్ధ జంట కారణంగానే కొత్త కేసులు వెలుగు చూస్తున్నట్టు అధికారులు గుర్తించారు.  గన్షు ప్రావిన్స్‌, ఇన్నర్ మంగోలియాలోని జియాన్‌కు వెళ్లడానికి వారు షాంఘై నుంచి బయలుదేరినట్టు అధికారులు తెలిపారు. వారి కారణంగా బీజింగ్ సహా ఐదు ప్రావిన్సుల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు.

మళ్లీ కరోనా కేసులు వెలుగుచూస్తుండడంతో అప్రమత్తమైన కమ్యూనిస్ట్ ప్రభుత్వం.. వందలాది విమానాలను రద్దు చేసింది. ప్రధాన విమానాశ్రయాలైన జియాన్, లంఝ విమానాశ్రయం నుంచి దాదాపు 60 శాతం విమానాలు రద్దయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, వినోద ప్రదేశాలు మూసివేసింది చైనా ప్రభుత్వం. పెద్ద ఎత్తున కరోనా టెస్ట్ లు ప్రారంభించింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లొద్దని లంఝ నగర ప్రజలను స్థానిక అధికారులు ఆదేశించారు. కాగా, ఇవాళ చైనాలో 13 కొత్త కేసులు నమోదైనట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది.

ALSO READ Salmonella Outbreak: అమెరికన్లను వణికిస్తున్నకొత్త వ్యాధి.. ఇంట్లో ఉల్లిపాయలను విసిరిపారేస్తున్నారు!