Salmonella Outbreak: అమెరికన్లను వణికిస్తున్నకొత్త వ్యాధి.. ఇంట్లో ఉల్లిపాయలను విసిరిపారేస్తున్నారు!

అమెరికాను మరో కొత్త వ్యాధి వణికిస్తోంది. వంటగదిలో ఉండే ఉల్లిపాయే దీనికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Salmonella Outbreak: అమెరికన్లను వణికిస్తున్నకొత్త వ్యాధి.. ఇంట్లో ఉల్లిపాయలను విసిరిపారేస్తున్నారు!

Salmonella Outbreak Why Us Fda Asking People To Throw Away Onions

Salmonella outbreak : అమెరికాను మరో కొత్త వ్యాధి వణికిస్తోంది. వంటగదిలో ఉండే ఉల్లిపాయే దీనికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉల్లిపాయల నుంచి సాల్మొనెల్లోసిస్ (salmonellosis) అనే వ్యాధి వ్యాపిస్తోంది. సాల్మొనెల్లా (Salmonella) అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి విజృంభిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారీగా ఈ కేసులు నమోదైనట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ బ్యాక్టీరియా వ్యాప్తికి ఉల్లిపాయలకు మధ్య సంబంధం ఉందని సెంటర్స్ ఫర్ డెసీస్ అండ్ ప్రవెన్షన్ (CDC) తేల్చింది. అక్టోబరు 18 నాటికి 37 రాష్ట్రాల్లో ఈ సాల్మొనెల్లా బ్యాక్టీరియా 652 మందికి వ్యాపించిందని CDC డేటా వెల్లడించింది. ఈ వ్యాధి మరింత ప్రబలితే మహమ్మారిగా మారే ముప్పు ఉందని CDC హెచ్చరించింది.

సెప్టెంబరు మధ్యలోనే ఈ సాల్మోనెల్లా కేసులు బయటపడ్డాయి. కానీ, ఈ వ్యాధి ఏ ఆహారం వల్ల వచ్చిందనే విషయాన్ని అధికారులు గుర్తించలేదు. ప్రధానంగా మెక్సికో, చిహువా నుంచి ప్రోసోర్స్ (ProSource) అనే సంస్థ ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంది. ఈ ఉల్లిపాయలను దేశంలోని అనేక రెస్టారెంట్లు, కిరాణా షాపులకు పంపిణీ చేసింది. ఆగస్టు 27వ చివరిసారిగా ఉల్లిపాయలను దిగుమతి చేశారు. ఆయా ఉల్లిపాయాలను ఇళ్లల్లో, రెస్టారెంట్లలో వినియోగించినట్టు తేలింది. అమెరికాలో ప్రస్తుత వ్యాధి వ్యాప్తికి ఈ ఉల్లిపాయలనే కారణమని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఉల్లిపాయల సరఫరాదారులకు ఈ సాల్మొనెల్లా వ్యాప్తితో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Selling Human skulls,Bones :రండి బాబూ రండీ..మనుషుల పుర్రెలు, ఎముకలు కొనుక్కోండీ..నెట్టింట్లో ఎముకల వ్యాపారం

మూడు నెలలపాటు నిల్వ చేసిన ఉల్లిపాయలతో పాటు సాల్మొనెల్లా బ్యాక్టిరీయా సోకిన ఉల్లిపాయలను ఎట్టిపరిస్థితుల్లో వాడటం నిషిద్ధమని CDC కస్టమర్లను హెచ్చరించింది. ఎక్కడి నుంచి ఉల్లిపాయలు వచ్చాయో తెలియకపోయినా.. మెక్సికో నుంచి చ్చినా.. ఎలాంటి స్టిక్కర్ ఉండకపోయినా.. ప్రోసోర్స్ నుంచి వచ్చిన ఉల్లిపాయలు ఏమైనా ఉంటే వెంటనే బయట పడేయాలని సీడీసీ జాగ్రత్తలు సూచించింది. జులై 1 నుంచి ఆగస్టు 27వరకు దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను వెనక్కి తీసుకునేందుకు ప్రోసోర్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్టు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) వెల్లడించింది. అన్నీ దుకాణదారులు ఉల్లిపాయలు తిరిగి వెనక్కు పంపాలని ప్రోసోర్స్ రీకాల్ నోటీసులు జారీ చేసిందని పేర్కొంది.

లక్షణాలివే :
సాల్మొనెల్లా వ్యాధి సోకినవారిలో వాంతులు, జ్వరంతో పాటు డయేరియా, పొట్టలో నొప్పి, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ బాక్టీరియా సోకిన ఉల్లిపాయలు తిన్నవారిలో ఆరు గంటల నుంచి ఆరు రోజుల్లో సాల్మొనెల్లోసిస్ వ్యాధి సోకుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. బాధితుల్లో చాలా మందికి ఎలాంటి వైద్య చికిత్సలు అవసరం లేకుండానే 4 నుంచి 7 రోజుల్లో కోలుకుంటున్నారని CD ప్రకటించింది. ఈ వ్యాధి వ్యాప్తిని గుర్తించేందుకు దిగుమతి అయిన అన్ని రకాల ఆహార పదార్థాలను పరీక్షిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

అమెరికాలోని 37 రాష్ట్రాల్లో ఇప్పటికే సాల్మొనెల్లా వ్యాధి వ్యాపించినట్టు సీడీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. టెక్సాస్‌లో అత్యధికంగా 158 కేసులు, ఒక్లహామాలో 98, వర్జీనియాలో 59, ఇల్లినాయిస్‌లో 37, విస్కాసిన్‌లో 25, మిన్నెసోటాలో 23, మేరీల్యాండ్‌లో 58, మిస్సోరీలో 21 కేసులు నమోదయ్యాయని సీడీసీ తెలిపింది. ఇప్పటివరకు అధికారికంగా గుర్తించిన కేసుల కన్నా బాధితుల సంఖ్య ఎక్కువే ఉండవచ్చని సీడీసీ తెలిపింది. చాలా మందికి సాల్మొనెల్లా టెస్టులు చేయకముందే కోలుకుంటున్నారని సంస్థ వెల్లడించింది.
Covishield : డెల్టా వేరియంట్ పై 91శాతం సమర్థవంతంగా కోవిషీల్డ్