Selling Human skulls,Bones :రండి బాబూ రండీ..మనుషుల పుర్రెలు, ఎముకలు కొనుక్కోండీ..నెట్టింట్లో ఎముకల వ్యాపారం

రండి బాబూ రండీ..మనుషుల పుర్రెలు, ఎముకలు కొనుక్కోండీ..అంటూ ఆన్ లైన్ లో ఎముకల వ్యాపారం చేస్తున్నాడు ఓ యువకుడు. వ్యాపారం కోసం పుర్రెల్ని, ఎముకల్ని ఎలా తెస్తాడంటే..

Selling Human skulls,Bones :రండి బాబూ రండీ..మనుషుల పుర్రెలు, ఎముకలు కొనుక్కోండీ..నెట్టింట్లో ఎముకల వ్యాపారం

American Yong Man Selling Human Skulls And Bones

american Yong man selling human skulls and bones : ‘రండి బాబూ రండీ.. తాజా తాజా కూరగాయలు..అంటే ఎవరైనా ‘కిలో ఎంత బాబూ’ అని అని కొనటానికి వస్తారు. చీరలండీ బాబూ చీరలు ఒకటి కొంటే మరొకటి ఉచితం అంటే ఎగబడి మరీ కొంటారు. అంతేగానీ..‘రండీ బాబూ రండీ మనుషుల పుర్రెలు, ఎముకలు రండీ కొనుక్కోండి..’ అంటే ఎవరా వస్తారా? రావటం మాట పక్కన పెడితే షాక్ అయిపోరూ..?!. ఎందుకవ్వరు కచ్చితంగా అవుతారు. ఇదేదో జోక్ కాదు నిజమే. ఓ కుర్రాడు నెట్టింట్లో..అదేనండీ ఆన్ లైన్ లో మనుషుల పుర్రెలు, ఎముకలు అమ్ముతున్నాడు. నెట్టింట్లో ఎముకల వ్యాపారం గురించి జోరుగా చర్చ నడుస్తోంది కాదు కాదు రచ్చ జరుగుతోంది. ఇంతకీ ఈ బొక్కల వ్యాపారం అందేనండీ ఎముకల వ్యాపారం చేసే ఆ యువకుడు ఎవరో ఈ వ్యాపారం విశేషాలేంటో చూసేయాల్సిందే..

ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండ్. అన్ని నెట్టింట్లో యాపారమే నడుస్తున్నాయి. అలా సోషల్ మీడియా ట్రెండ్ ను ఉపయోగించుకుని ఓ యాపారం చేద్దామనుకున్నాడు అమెరికాకు చెందిన ఓ యువకుడు. ఐడియా వచ్చాక ఇక ఆగేదేముంది? వెంటనే మొదలుపెట్టేద్దామనుకున్నాడు.ఇంకేముంది మొదలు పెట్టేశాడు. ఈ ఎముకల వ్యాపారంపై నెట్టింట పెద్ద చర్చే నడుస్తోంది..

Read more : సోషల్ మీడియాలో రౌడీ ప్రకటన : ఎవరినైనా కొట్టాలంటే రూ.5 వేలు, చంపాలంటే 55 వేలు..!!

అమెరికాకు చెందిన 21 ఏళ్ల జాన్‌-పిచయా ఫెర్రీ అనే టిక్‌టాకర్‌. అతినికి 5లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఐడియా సర్‌జీ.. అంటూ ఎముకల వ్యాపారం ప్రారంభించాడు. దీని కోసం న్యూయార్క్‌ నగరంలో ఏకంగా ఓ కంపెనీ ప్రారంభించాడు. మనుషుల ఎముకలు, పుర్రెలను అమ్ముతున్నానంటూ ప్రకటన కూడా ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనికి నెటిజన్ల నంచి పెద్ద స్పందనే వచ్చింది. ఈ వీడియోలు దారుణంగా ఉన్నాయంటూ కామెంట్ చేస్తున్నా..ఈ ఎముకలు ఎక్కడనుంచి తెచ్చావని కొందరు..వ్యాపారం కోసం జనాల్ని చంపేస్తున్నావా ఏంటీ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు ఏ వ్యాపారం దొరకలేదా నాయనా ఇటువంటిది చేస్తున్నావ్? అని అంటున్నారు.

Read more : Deaths Banned : ఇక్కడ మరణాలు నిషేధం..70 ఏళ్లుగా ఒక్కరు కూడా మరణించని ప్రదేశం

జాన్‌-పిచయా ఫెర్రీ వ్యాపారం కోసం వివిధ శ్మశానాల నుంచి సేకరించిన మనిషి పర్రెలు, ఎములను ప్రదర్శనగా పెడుతుంటాడు. ఎముకల నిర్మాణం, పుర్రెలోని పార్టులు, దంతాలు, ఎముకల అంతర్గత నిర్మాణంపై అవగాహన కల్పిస్తూ ఉంటాడు. తరువాత వాటిని ఆన్ లైన్ లో అమ్ముతుంటాడు. దీని కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను కూడా నడుపుతున్నాడు. మన దేశంలో ఇది అత్యం ఆశ్చర్యాన్ని కలిగించినా..అమెరికాలో మాత్రం అక్రమం కాదు సరికదా అది సక్రమమేనట.కళాకారులు, కీళ్ల నిపుణులు, యూనివర్శిటీ నిర్వాహకులకు.. పుర్రెలను పంపుతుంటాడట. గుర్తుతెలియని శవాల నుంచి పుర్రెల్ని, ఎముకల్ని సేకరించి వాటిని ఆన్ లైన్ లో అమ్ముతుంటాడట.