Deaths Banned : ఇక్కడ మరణాలు నిషేధం..70 ఏళ్లుగా ఒక్కరు కూడా మరణించని ప్రదేశం

అదొక అందాల పట్టణం. ఆ పట్టణంలో మానవ మరణాలు నిషేధం, అందుకే గత 70 ఏళ్ల నుంచి ఆ పట్టణంలో ఒక్కరంటే ఒక్కరు కూడా మరణించలేదు. ఈ వింత పట్టణం గురించి పలు ఆసక్తికర విషయాలు..

Deaths Banned : ఇక్కడ మరణాలు నిషేధం..70 ఏళ్లుగా ఒక్కరు కూడా మరణించని ప్రదేశం

City Where Deaths Are Banned (1)

City where deaths are banned : ఈ భూ ప్రపంచంలో ఎన్నో వింతలు మరెన్నో విచిత్రాలు. ఇంకెన్నో మిస్టరీలు. అటువంటి ఓ వింత నగరం నార్వేలోని ‘లాంగ్ ఇయర్ బెన్’. ఈ నగరంలో మానవ మరణాలు నిషేధం. ఈ నగరంలో గత 70 ఏళ్లనుంచి ఒక్కురు కూడా చనిపోలేదు. వినటానికి వింతగా ఉన్నా నిజం. ఈ నిజం వెనకు ఏదో బలమైన మిస్టరీ ఉండే ఉంటుందనిపిస్తోంది కదూ. నిజమే. గత 70 సంవత్సరాలుగా ఏ ఒక్క న‌ర‌మానవుడు కూడా మరణించని ప్రదేశం ప్రపంచ పటంలోప్ర‌త్యేకంగా క‌నిపించే దేశం నార్వే దేంలోని ‘లాంగ్ ఇయర్ బెన్’ పట్టణం..!! అందాలకు నిలయం ఈ పట్టణం.

‘లాంగ్ ఇయర్ బెన్’ చిన్న పట్టణం. 2000 మంది జనాభా. కానీ ప్రపంచ వ్యాప్తంగా పేరొందింది. ఎలాగంటే ఈ పట్టణంలో గత 70 ఏళ్లుగా ఒక్క మనిషి కూడా చనిపోనికారణంగా. వినటానికి ఇది చాలా చాలా వింతగా..ఆసక్తికరంగా ఉంటుంది దీని వెనక ఉన్న ఓ కారణం.అదే ఈ నగరానికి చెందిన‌ పరిపాలనా విభాగం చేసిన ఓ వినూత్న ‘చట్టం’.ఈ వినూత్న చట్టం ప్రకారం ఈ పట్టణంలో ఎవరూ మ‌ర‌ణించ‌కూడ‌దు. నగర పరిపాలనా విభాగం ఇక్కడ మానవ మరణాలను పూర్తిగా నిషేధించింది. లాంగ్ ఇయర్
బెన్ నగరం నార్వేలోని ఉత్తర ధృవంలో ఉంది. ఈ ప్రదేశం సంవత్సరం పొడవునా చాలా చాలా చల్లగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టస్థాయిలో ఉంటాయి. దీని వల్ల ఇక్కడ శవం కుళ్లిపోవడమంటూ జ‌ర‌గ‌దు.

Read more : Theater in Desert : ఎడారి మధ్యలో భారీ స్క్రీన్‌ తో థియేట‌ర్‌..ఎందుకు కట్టారంటే..

ఈ ఒక్క‌ కారణంతోనే న‌గ‌ర‌ పరిపాలనా విభాగం ఈ ప్రాంతంలో మానవ మరణాలను నిషేధించింది. ఈ నిబంధ‌న‌ గత 70 సంవత్సరాలుగా ఇక్క‌డ అమ‌ల‌ు జరుగుతోంది. అదే ఈ నగరంలో ఒక్కు చనిపోరనే దానికి కారణం. అందుకే ఈ పట్టణంలో ఒక్క మ‌ర‌ణం కూడా జరగలేదు. దీనికి మరో కారణం కూడా ఉంది. ఈ నగరంలో అధిక సంఖ్య‌లో క్రైస్తవులు నివసిస్తున్నారు. క్రైస్త్రవుల సంప్రదాయం ప్రకారం మతదేహాన్ని ఖననం చేస్తారు. కాల్చరు. అలా పాతిపెట్టిన మతదేహం ఎప్పటికీ కుళ్లిపోదు..భూమిలో కలిసిపోదు. అందుకే ఇక్కడ మరణాలు నిషేధం.

1917లో ఈ ప్రాంతానికి చెందిన‌ ఒక వ్యక్తి ఇన్‌ఫ్లుయెంజాతో మరణించాడు. ఆ వ్యక్తి మృతదేహాన్ని అప్పుడు ఇక్కడే అంటే ‘లాంగ్ ఇయర్ బెన్’ నగరంలో ఖననం చేశారు. అయితే ఆ వ్య‌క్తి క‌ళేబ‌రం నుంచి ఇప్పటికీ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు వ్యాపిస్తున్నాయ‌ట‌. ఈ అంటువ్యాధి నుంచి నగర ప్ర‌జ‌ల‌ను రక్షించడానికి ఇక్క‌డి పరిపాలనా విభాగం ఈ ప్రాంతంలో ప్రజలు చనిపోకుండా నిషేధాజ్ఞలు జారీచేసింది.

Read more : Death Mystery: ఆ గ్రామంలో ఒకరు చనిపోతే.. వెంటనే మరొకరు చనిపోతున్నారట..!

లాంగ్ ఇయర్ బెన్ నగరంలో..ఎవ‌రైనా తీవ్ర అనారోగ్యం బారిన‌ప‌డి, చావుబ‌తుకులు మ‌ధ్య కొట్టుమిట్టాడుతుంటే..వారిని వెంట‌నే మ‌రోచోటికి తరలించేస్తారు ఆఘమేఘాల మీద. లాంగ్ ఇయర్ బెన్ నగరంలో మాత్రం ప్రాణం పోనివ్వరు. అలా మరోచోటికి తరలించాక సదరు వ్యక్తి మరణిస్తే ఈ లాంగ్ ఇయర్ బెన్ నగరానికి ఎట్టి పరిస్థితుల్లోను తీసుకురాకూడదు. అక్క‌డే ఖనం చేస్తారు. తిరిగి ఈ ‘లాంగ్ ఇయర్ బెన్‌’ నగరానికి తీసుకూడదు..ఇక్కడ ఖననం చేయకూడదు.ఇక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి తీసుకున్న నిర్ణయాలతో అమలు అవుతున్న చట్టం ప్రకారం. అలా లాంగ్ ఇయర్ బెన్ నగరంలో గత 70 ఏళ్లనుంచి ఒక్కరు కూడా చనిపోలేదు.