Theater in Desert : ఎడారి మధ్యలో భారీ స్క్రీన్‌ తో థియేట‌ర్‌..ఎందుకు కట్టారంటే..

ఎడారి మధ్యలో పర్వతాల మధ్యలో భారీ స్క్రీన్‌ తో ఓ థియేట‌ర్‌. కానీ దాంట్లో ఇప్పటి వరకు..

Theater in Desert : ఎడారి మధ్యలో భారీ స్క్రీన్‌ తో థియేట‌ర్‌..ఎందుకు కట్టారంటే..

Theater In Desert

A movie theater was built in the desert : సినిమా థియేటర్ కు వెళ్లాలంటే దానికి ఏసీ ఉందో లేదో తెలుసుకుని వెళతాం. అందులోని వేసవికాలంలో అయితే ఏసీ థియేటర్ కు వెళ్లటానికే ఇష్టడపతాం. ఆ థియేటర్ లో ఏదైనా నాటక ప్రదర్శనగానీ. డ్యాన్స్ ప్రోగ్రామ్, లేదా సినిమా అయినా చూడటానికి వెళ్లాలంటే ఏసీ ఉందో లేదో తెలుసుకునే వెళతాం. మండిపోయే థియేటర్ ఎడారిలో ఉంటే..అసలు అక్కడికి వెళతామా? నీటి జాడే కనిపించని ఎడారిలో థియేటరా? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే పిరమిడ్లకు ప్రసిద్ధి చెందిన ఈజిప్టు ఎడారిలో ఓ థియేటర్. ఆ థియేటర్ లో భారీ స్క్రీన్. కానీ ఈ థియేటర్ లో ఒక్క ప్రదర్శన కూడా జరగలేదు. ఎందుకంటే..తెలుసుకుందాం..

ఈజిప్టు అంటే పురాతన నాగరికత గుర్తుకొస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పిరమిడ్లు గుర్తుకొస్తాయి. ప్రపంచం లోకెల్లా అతి పొడవైన నైలు నది గుర్తుకొస్తుంది. అంత్యంత సౌందర్యరాశి అని పేరు పొందిన క్లియోపాత్ర సొగసులు గుర్తుకొస్తాయి.అంతుచిక్క‌ని రహస్యాల‌ నెలవు ఈజిప్టు దేశం. ఇలా ఈజిప్టు అంటే వింతలకు విశేషాలకు..ప్రాచీన నాగరికతలకు ప్రసిద్ధి చెందిన దేశం.

Read more : Pharaoh’s curse coming true : ఈజిప్టు మమ్మీల శాపం నిజమవుతోందా? అందుకే సూయిజ్‌లో నౌక ఇరుక్కుందా?

అటువంటి ఈజిప్టు ఎడారిలో ఓ థియేటర్. వింతలకు నిలయమైన ఈజిస్టులోని కొన్ని నిర్మాణాలు ఇప్ప‌టికీ అంతుచిక్క‌ని రహస్యాల‌ుగా ఉన్నాయి. అటువంటి ఒక ప్రత్యేకమైన ప్రదేశం గురించి తెలుసుకుందాం. ప్ర‌పంచంలో ఎప్పుడూ ఎవ‌రూ క‌నీవినీ ఎరుగ‌ని ఒక థియేట‌ర్‌. దీనిని ఈజిప్టులో సినాయ్ ద్వీపకల్పానికి దక్షిణాన ఈ ఎడారి మధ్యలో పర్వత శ్రేణి కింది భాగంలో వందల ఏళ్ల‌ క్రితం ఈ థియేటర్ నిర్మించారు. ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ థియేటర్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క ప్ర‌ద‌ర్శ‌న‌ కూడా జ‌ర‌గ‌కపోవటం విశేషం. అలా ఏ ప్రదర్శనా జరగకుండానే ఆ థియేటర్ శిథిలమైపోయింది.

అసలు ఎడారి మ‌ధ్య‌లో సినిమా థియేటర్ ఎందుకు నిర్మించారు? దాంట్లో ఒక్క ప్ర‌ద‌ర్శ‌న కూడా ఎందుకు నిర్వ‌హించ‌లేదో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతాం. ఈ అద్భుత‌మైన థియేట‌ర్‌లో వందలాది కుర్చీలు కూడా క‌నిపిస్తాయి. థియేటర్ శిథిలం అయిపోయినా నేటికి ఆ కుర్చీలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇది కేవ‌లం ఒక పర్యాటక కేంద్రంగా మాత్రమే ఉంది. దీన్ని ఒక ఫ్రెంచ్ వ్యక్తి నిర్మించాడు.

Read more : WiFi Cut : 2000 మందికి WiFi లేకుండా చేసిన ఎలుకలు..రంగంలోకి దిగిన ప్రభుత్వ అధికారులు

గంజాయి వ్య‌స‌నానికి అల‌వాటు ప‌డిన అత‌ను త‌న ద‌గ్గ‌రున్న డ‌బ్బును వృథా చేయ‌కుండా ఓ థియేటర్ నిర్మించాలని అనుకున్నాడట. అలా థియేటర్ ఎక్కడ కట్టాలో చూడటానికి తన స్నేహితులతోపాటు సినాయ్ ఎడారిలో ప‌ర్య‌టించాడు. అలా పర్వతాల మధ్యలో ఉన్న ఖాళీ స్థలం అతనికి నచ్చింది. అక్కడే ఓ థియేట‌ర్ నిర్మించాల‌నుకున్నాడు. అనుకున్న వెంట‌నే ఈజిస్టు రాజధాని కైరో నుంచి చైర్ల‌ను తెప్పించాడు. జనరేటర్‌ను ఆర్డర్ చేయ‌డంతోపాటు భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశాడు. ఆ ప్రదేశాన్ని అద్భుత‌మైన సినిమా థియేటర్‌గా మార్చాడు.

కానీ ఎడారిలో మధ్యలో థియేటర్ ఏంటీ అంటూ జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఈ థియేటర్ నచ్చలేదు. అలా ఎటువంటి ప్రదర్శనా కూడా జరకుండానే ఆ థియేటర్ శిథిలమైపోయింది. అలా కొంత‌కాలానికి ఎవ‌రో జనరేటర్‌ను ఎత్తుకెళ్లిపోయారు. కానీ థియేటలర్ లో కుర్చీలు మాత్రం అలాగే ఉన్నాయి ఇప్పటికీ కూడా. దీంతో ఎడారి మధ్యలో ఆ కుర్చీలను చూడటానికి పర్యాటకులు వస్తుంటారు.అదన్నమాట ఎడారి మధ్యలో థియేటర్ చరిత్ర..ఆ థియేటర్ జనాలకు ఆకట్టుకోలేకపోయినా గానీ ఈనాటికి అది గుర్తుండిపోయేలా ఉంది.