Pharaoh’s curse coming true : ఈజిప్టు మమ్మీల శాపం నిజమవుతోందా? అందుకే సూయిజ్‌లో నౌక ఇరుక్కుందా?

పురాత‌న ఈజిప్టు రాజుల స‌మాధులు తెరిస్తే శాపం త‌గులుతుందా ? ఇందులో నిజ‌మేంతా? ఈజిప్టు (ఫరో) రాజుల శాపం వల్లనే వరుస విపత్తు సంఘటనలు జరిగాయా? అసలు ఎందుకు ఇలా జరుగుతోంది.. వరుస వింత ఘటనలకు మమ్మీలకు సంబంధం ఏంటంటే..

10TV Telugu News

Egypt Pharaoh’s curse coming true on Suez: పురాత‌న ఈజిప్టు రాజుల స‌మాధులు తెరిస్తే శాపం త‌గులుతుందా ? ఇందులో నిజ‌మేంతా? ఈజిప్టు (ఫరో) రాజుల శాపం వల్లనే వరుస విపత్తు సంఘటనలు జరిగాయా? మొన్న సోహాగ్ లో ఘోర రైలు ప్రమాదం, గతవారం 10 అంతస్తుల భవనం కుప్పకూలడం, ఇప్పుడు సూయిజ్ కెనాల్ లో భారీ నౌక ఎవర్ గివెన్ చిక్కుకుపోవడం.. వంటి వింత ఘటనలకు మమ్మీల శాపమే కారణమని సోషల్ మీడియా కోడై కోస్తోంది.

Ship

ఈజిప్టును పాలించిన రాజులందరినీ ఆధునిక వ్యవహారిక భాషలో ఫరో లేదా ఫారో అని పిలుస్తారు. ఫరో అంటే రాజు అని అర్థం.. ప్రాచీన రాయల్ ఫ్యామిలీకి చెందిన రాజుల మమ్మీలను కదిలిస్తే వారి శాపం తగులుతుందని సోషల్ మీడియాలో వదంతులు వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది.. వరుస వింత ఘటనలకు మమ్మీలకు సంబంధం ఏంటంటే.. వచ్చే ఏప్రిల్ 3న జరిగే ఉత్సవంలో 22 రాయల్ మమ్మీలను ఈజిప్టులోని ఒక మ్యూజియం నుంచి మరో మ్యూజియానికి తరలించనున్నారు.

Eypsts

రాజుల మమ్మీలను తరలించేందుకు సమయం 40 నిమిషాలు పడుతుంది. మ్యూజియం ప్రదర్శన కోసం ఈ మమ్మీలను తరలిస్తుంటారు. తరలించే మమ్మీ రాజులలో కింగ్ రామెసెస్ II, సెకెనెన్రే టావో, తుట్మోస్ III, సెటి I, రాణుల్లో హాట్షెప్సుట్, కింగ్ అమెన్హోటెప్ I భార్య, అహ్మోస్-నెఫెర్టారి, కింగ్ అహ్మోస్ భార్య ఉన్నారు. వీరిలో రామ్సేస్ II, కింగ్ రామ్సేస్ ది గ్రేట్ అని పిలుస్తారు. పురాతన ఈజిప్టు అత్యంత శక్తివంతమైన పాలకుడిగా పేరొంది.

Egypt

రాయల్ మమ్మీలు శపించారా? :
ఈ ఉత్సవంలో భాగంగా తహ్రీర్ స్క్వేర్‌లోని ఈజిప్టు మ్యూజియం నుంచి ఫస్టాట్‌లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ సివిలైజేషన్‌కు మమ్మీలను తరలించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో కింగ్ రామ్‌సేస్ II, క్వీన్ అహ్మోస్-నెఫెర్టారి అవశేషాలు ఉన్నాయి. ఈ రాయల్ మమ్మీల శాపం ఫలితంగానే సూయజ్ నౌక, రైలు ప్రమాదం, 10 అంతస్తుల బిల్డింగ్ కూలిపోవడం వంటి ఘటనలతో సంబంధం ఉందంటూ వదంతులు వినిపిస్తున్నాయి. రాజుల మమ్మీల శాంతికి భంగం కలిగించేవారికి వెంటనే మరణిస్తారంటూ, అందుకే ఈ వరుస విపత్తులు సంభవిస్తున్నాయని సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరోవైపు పురావస్తు తవ్వకాల సమయంలో పురాతన సమాధులు ఏమి దెబ్బతినలేదని, ఈ విపత్తులు కేవలం విధి మాత్రమేనని అంటూ పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Sg

అసలు కారణం ఇదేనంట..
వాస్తవానికి ఈజిప్టులో క్రీస్తు పూర్వం 3వేల ఏళ్ల క్రితం మ‌మ్మీలు పిర‌మిడ్ల‌లో ఉన్నాయి. పురాత‌న ఈజిప్టు రాజులు చ‌నిపోయిన‌ప్పుడు వారి శ‌రీరాల‌కు ప్ర‌త్యేక లేప‌నాలు పూస్తారు. రాజుల కోసం వారు ఇష్టపడే ఆహారాల‌ను కూడా స‌మాధుల్లో ఉంచేవారు. పురాత‌న మ‌మ్మీలు, పిర‌మిడ్ల గురించి ఇప్ప‌టికీ జ‌నాల్లో ఒక వ‌దంతు ప్ర‌చారంలో ఉంది. ఈజిప్టు రాజుల‌కు చెందిన స‌మాధుల‌ను తెరిచినా.. వారి మ‌మ్మీల‌ను వెలికి తీసినావారంతా శాపం బారిన ప‌డి చ‌నిపోతార‌ని చాలా మంది నమ్ముతారు.

Wgg

గ‌తంలో 1922లో ఈజిప్టులోని ల‌గ్జ‌ర్ అనే ప్రాంతంలో కింగ్స్ వ్యాలీ వ‌ద్ద పురాతన ఈజిప్టు రాజు ట్యుటన్‌ఖామ‌న్ స‌మాధిని తెరిచిన‌ లార్డ్ కార్నర్‌వాన్ అనే వ్యక్తి వెంట‌నే చ‌నిపోయాడు. ఈజిప్టు మ‌మ్మీల‌కు చెందిన శాపం నిజ‌మేన‌ని అప్పట్లో న‌మ్మారు. అయితే నిజానికి అలాంటి శాపం అంటూ లేద‌ని ఆధునిక పురాత‌త్వ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

Eyptt

3వేల ఏళ్ల కింద‌టి స‌మాధుల్లో బాక్టీరియా, హానికార‌క క్రిములు ఎక్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల ఆ స‌మాధుల్లోకి ప్ర‌వేశించ‌గానే రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారికి బ్ల‌డ్ పాయిజ‌న్ అయి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. అలాంటి స‌మాధుల‌ను తెరిచినవారు వెంటనే చ‌నిపోతార‌ని సైంటిస్టులు అంటున్నారు. పురాతన స‌మాధుల్లో తిర‌గడం వ‌ల్ల తీవ్ర‌మైన బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్‌కు గురై చ‌నిపోతార‌ని చెబుతున్నారు.

33

లార్డ్ కార్న‌ర్‌వాన్ కూడా బ్ల‌డ్ పాయిజ‌నింగ్ కార‌ణంగానే చ‌నిపోయాడు. అందువ‌ల్ల అత‌ని మ‌రణం శాపం వ‌ల్ల సంభ‌వించింది కాద‌ని, బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్ వ‌ల్లే సంభ‌వించింద‌ని ఆధునిక సైంటిస్టులు తెలిపారు. పురాత‌న ఈజిప్టు రాజుల స‌మాధులు, మ‌మ్మీల‌ను తెర‌వ‌డం వ‌ల్ల ఎలాంటి శాపం త‌గ‌ల‌ద‌ని వారు తేల్చారు.