Covishield : డెల్టా వేరియంట్ పై 91శాతం సమర్థవంతంగా కోవిషీల్డ్

డెల్టా వేరియంట్ కారణంగా సంభవించే మరణాలను అడ్డుకోవడంలో కోవిషీల్డ్,ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ 90శాతం ప్రభావవంతంగా పనిచేస్తాయని తేలింది. ఈ మేరకు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో

Covishield : డెల్టా వేరియంట్ పై 91శాతం సమర్థవంతంగా కోవిషీల్డ్

Vaccine

Covishield   డెల్టా వేరియంట్ కారణంగా సంభవించే మరణాలను అడ్డుకోవడంలో కోవిషీల్డ్,ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ 90శాతం ప్రభావవంతంగా పనిచేస్తాయని తేలింది. ఈ మేరకు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో గురువారం ఓ అధ్యయనం పబ్లిష్ అయింది. స్కాట్ లాండ్ వైడ్ EAVE II కోవిడ్ -19 నిఘా ఫ్లాట్ ఫాం నుంచి సేకరించిన డేటాను ఉపయోగించి ఈ అధ్యయనాన్ని రూపొందించారు.

ప్రస్తుతం వివిధ దేశాలను భయపెడుతున్న కోవిడ్ డెల్టా వేరియంట్ నుంచి సంభవించే మరణాలను అడ్డుకోవడంలో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లు ఎంతమేర ప్రభావంగా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు ఈ అధ్యయనన్ని నిర్వహించారు. ఎడిన్ బర్గ్ యూనివర్శిటీ ,స్టాచ్ క్లైడ్ యూనివర్శిటీ మరియు పబ్లిక్ హెల్త్ స్కాట్లాండ్ కు చెందిన రీసెర్చ్ బృందం..ఏప్రిల్-1,2021 నుంచి సెప్టెంబర్-27 మధ్యలో స్కాట్ లో ని 54లక్షల మందికి చెందిన డేటాను విశ్లేషించింది.

ఏప్రిల్-1-సెప్టెంబర్ 27 మధ్య కాలంలో..నేరుగా హాస్పిటల్ నుంచి కాకుండా కమ్యూనిటీ(సమాజం)లో నిర్వహించిన పీసీఆర్ టెస్ట్ లో..1లక్షా 15మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. 201 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అయితే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారికి మరణ ముప్పుని అడ్డుకోవడంలో ఫైజర్-బయోఎన్ టెక్ వ్యాక్సిన్ 90 శాతం ప్రభావవంతంగా మరియు ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్(భారత్ లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ గా పిలువబడుతుంది)91శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు అధ్యయనం కనుగొంది.

ప్రపంచంలోని చాలా ప్రాంతాలను టెన్షన్ పెడుతున్న డెల్టా వేరియంట్‌..యూకేలో గతంలో వెలుగుచూసిన వేరియంట్ల కన్నా హాస్పిటల్ పాలయ్యే ప్రమాదాలను ఎక్కువగా కలిగిస్తోంది. అయితే కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న వెంటనే మరణ ముప్పు నుంచి అధిక రక్షణ కలుగుతుందని EAVE II స్టడీకి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఆజిజ్ షేక్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోనివాళ్లు ఉంటే వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని..దీనివల్ల చాలా లాభాలున్నాయని అజిజ్ షేక్ తెలిపారు.

ALSO READ UP Election : మహిళల ఓట్లే లక్ష్యంగా కాంగ్రెస్ వరాలు..బాలిక‌ల‌కు స్మార్ట్ ఫోన్లు, గ్రాడ్యుయేట్ల‌కు స్కూటీలు