Bonalu 2023
Golkonda Bonalu: హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు షురూ అయ్యాయి. లంగర్‌హౌస్ చౌరస్తాలో గోల్కొండ కోటలోని జగదాంబ మహాకాళి అమ్మవారి ఆలయ కమిటీకి ప్రభుత్వం తరఫున మంత్రులు తలసాని, మహమ్మద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డిలు పట్టువస్తాలను సమర్పించారు. లంగర్ హౌస్ చౌరస్తా నుంచి గోల్కొండ కోట వరకు తొట్టేల ఊరేగింపులో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… మహంకాళి, జగద్ధంబికా జాతర బోనాల ఉత్సవాలు ఇవాళ ఘనంగా ప్రారంభం అవుతున్నాయని, అంగరంగ వైభవంగా తెలంగాణ నడి బొడ్డున జగద్ధంబికా అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగిందని మంత్రి తెలిపారు. సికింద్రాబాద్, లాల్ దర్వాజ్ బోనాల ఉత్సవాలు హైదరాబాద్ వ్యాప్తంగా జరుగుతాయని చెప్పారు.
Bonalu : తెలంగాణలో బోనాల సందడి షురూ
భారత దేశంలో హిందువుల గురించి ఎవరెవరో మాట్లాడుతారు. కానీ, హిందువుల పండుగలకు సహకరించేది సీఎం కేసీఆర్ అని చెప్పారు. దేశవ్యాప్తంగా చెప్పుకునే విధంగా 1200 కోట్లతో యాదాద్రిని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని అన్నారు. బోనాల ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖకు అందరూ సహకరించాలని మంత్రి తలసాని కోరారు. తెలంగాణ రాష్టం ఏర్పడకముందు అతి తక్కువ మందితో గోల్కొండ జగదాంబికా అమ్మవారి జాతర జరిగేది. కానీ, ఇప్పుడు లక్ష మందికి పైగా పాల్గొంటున్నారని మంత్రి చెప్పారు. పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ఆషాడ మాసం మొత్తం బోనాల జాతర కొనసాగుతుందని, హైదరాబాద్ బోనాలకు వివిధ జిల్లాల నుండి వస్తారని అన్నారు. ఎక్కడ చేయని విధంగా అంగరంగ వైభవంగా బోనాల జాతర నిర్వహిస్తున్నామని, బోనాల పండుగకు 15కోట్ల రూపాయల పండుగ ముందే అందజేశామని మంత్రి తలసాని చెప్పారు.
Bonalu Festival : తెలంగాణలో బోనాల పండగ సందడి.. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి మొదటి బోనం
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ పట్టణంలో మన భాగ్యనగరంలో బోనాల పండుగ మొదలైందని అన్నారు. ఈరోజు జగదాంబ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజుల పాటు ఈ పండుగ ఘనంగా జరుపుకుంటామని, తెలంగాణ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా నిర్వహించు కుంటున్నామని మంత్రి అన్నారు. 15కోట్లను బోనాల పండగకు సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రకటించడం జరిగిందని అన్నారు.
దశాబ్ది ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని, బుధవారం రాత్రి హైదరాబాద్‌లో వర్షంతో దేవుడు స్వాగతం తెలిపారని మంత్రి అన్నారు. ఇవాళ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా అమర వీరుల జ్యోతి వెలిగించడం జరుగుతుందని అన్నారు. అందరూ సహకరించి పండగను ఘనంగా నిర్వహించుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు.