Gold and silver Rate
Gold and Silver Prices Today: బంగారం కొనుగోలు దారులకు గుడ్‌న్యూస్.. వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ పతనం కావడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 250 తగ్గగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 270 తగ్గింది. మరోవైపు వెండి ధర పెరిగింది. వరుసగా మూడు రోజులు తగ్గుతూ వచ్చిన వెండి.. శనివారం పెరిగింది. కేజీ వెండిపై రూ. వెయ్యి పెరిగింది.
Gold
తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు..
తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా నాలుగోరోజు బంగారం ధరలు తగ్గాయి. దీంతో నాలుగు రోజుల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 1300 తగ్గింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 53,650కి చేరింది. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 58,530గా నమోదైంది.
Gold
దేశంలోని ప్రధాన నగరాల్లో..
– దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 53,800 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 58,680 వద్దకు చేరింది.
– చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 53,900 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 58,800కి చేరింది.
– బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 53,650 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 58,530 వద్ద కొనసాగుతుంది.
– కోల్‌కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 53,650 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 58,530.
– ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 53,650కాగా. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 58,530 వద్దకు చేరింది.
Gold
వెండి ధరలు ఇలా..
దేశవ్యాప్తంగా వెండి ధరలు పెరిగాయి. కిలో వెండిపై రూ. వెయ్యి పెరుగుదల చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 77,500 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500 కాగా, ముంబయి, ఢిల్లీ, కోల్ కతాలలో రూ. 74,700గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి 72,500 వద్దకు చేరింది.