Gold Smuggling in Shamshabad Airport
Gold Smuggling in Shamshabad Airport : కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో గోల్డ్ స్మగ్లింగ్ కు ప్రయత్నిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా అడ్డంగా దొరికిపోతున్నారు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి బంగారం అక్రమ రవాణ గుట్టు రట్టైంది.
కస్టమ్స్ అధికారులు ప్రయాణికుల నుంచి 1600 గ్రాముల బంగారం సీజ్ చేశారు. పట్టుబడిన గోల్డ్ విలువ కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. బంగారాన్ని డిటర్జెంట్ సర్ఫ్ లో దాచి తరలించే యత్నం చేశారు. అయినా అధికారుల తనిఖీల్లో దొరికిపోయారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికులను అధికారులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదున్నర కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠాని మాదాపూర్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి బిల్లులు లేకుండా బంగారం తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, బంగారాన్ని సీజ్ చేసి చందానగర్ పోలీసులకు అప్పగించారు మాదాపూర్ SOT పోలీసులు.