pushpak bus fares
TGSRTC Pushpak Buses: హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్టుకు, అక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు గ్రేటర్ ఆర్టీసీ పుష్పక్ బస్సులను నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఛార్జీలను తగ్గిస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ బస్సుల్లో ఛార్జీలను రూ.50 నుంచి రూ.100 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6గంటలకు వరకు ప్రత్యేక ఛార్జీల్లోనూ రూ.50 తగ్గిస్తున్నట్టు ప్రకటించారు.
తగ్గించిన ఛార్జీలు ఇలా..
♦ ఎయిర్‌పోర్టు నుంచి శంషాబాద్‌కు ప్రస్తుతం రూ.200ఛార్జీకాగా.. ఇక నుంచి రూ. 100.
♦ ఎయిర్‌పోర్టు నుంచి ఆరామ్‌ఘర్ వరకు రూ.250కాగా.. ఇకనుంచి రూ. 200.
♦ ఎయిర్‌పోర్టు నుంచి మెహదీపట్నం వరకు రూ.350 కాగా.. ఇకనుంచి రూ.300.
♦ ఎయిర్‌పోర్టు నుంచి పహాడీ షరీఫ్‌కు రూ.200 కాగా.. ఇకనుంచి రూ. 100.
♦ ఎయిర్‌పోర్టు నుంచి బాలాపూర్‌కు ప్రస్తుతం రూ.250కాగా ఇకనుంచి రూ. 200.
♦ ఎయిర్ పోర్టు నుంచి ఎల్బీ నగర్ వరకు ప్రస్తుతం రూ.350 కాగా.. ఇక నుంచి రూ.300
అదేవిధంగా.. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6గంటల మధ్య ప్రస్తుతం ఉన్న ఛార్జీల్లోనూ రూ.50 తగ్గిస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ప్రకటించింది. ఎయిర్ పోర్టు నుంచి జూబ్లీ బస్టాండ్, జేఎన్టీయూ, మియాపూర్, లింగంపల్లికి రూ.450కాగా.. ఇకనుంచి రూ.400 తీసుకోనున్నారు. ఈ ఛార్జీలు ఆగస్టు 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చిన ట్లు అధికారులు తెలిపారు.