×
Ad

Sankranti Special Trains : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి 150 ప్రత్యేక రైళ్లు.. ఏఏ ప్రాంతాలకు వెళ్తాయంటే?.. వివరాలు ఇలా..

Sankranti Special Trains : సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ. శ్రీధర్ తెలిపారు.

Sankranti Special Trains

Sankranti Special Trains : సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ. శ్రీధర్ తెలిపారు. మొత్తం 150 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యే కాకుండా దేశంలోని ఉత్తర, తూర్పు, దక్షిణ భారత ప్రాంతాలకు కూడా రైళ్లను నడపనున్నట్లు వివరించారు.

Also Read : YS Jagan : భోగాపురం క్రెడిట్ చోరీకి చంద్రబాబు పడరానిపాట్లు.. ఏం చేశారని అతనికి క్రెడిట్ ఇవ్వాలి.. అంతా చేసింది మేమే..

హైదరాబాద్ నుంచి కోస్తాంధ్ర ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా నర్సాపురం, కాకినాడ, శ్రీకాకుళంలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, అంతేకాక వైజాగ్ నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తాయని చెప్పారు. పండుగ సమయంలో రద్దీగా ఉండే తిరుపతి, షిరిడీ తదితర పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైళ్లను కేటాయించినట్లు శ్రీధర్ తెలిపారు. వీటితోపాటు నాందేడ్, మహారాష్ట్రలోని పలు ప్రధాన స్టేషన్ల నుంచి కూడా ప్రత్యేక సర్వీసులు నడుస్తున్నాయని చెప్పారు.

పండుగ సీజన్‌లో 150 ప్రత్యేక రైళ్లలతోపాటు 600 రైళ్లు నిరంతరాయంగా నడుస్తాయని, తద్వారా సికింద్రాబాద్ లాంటి ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా ఎదుర్కొవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు సీపీఆర్వో శ్రీధర్ కీలక విజ్ఞప్తి చేశారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పండుగ రద్దీ సమయంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రైల్వే శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొన్ని ముఖ్య రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లకు మళ్లించడం జరిగింది.. మరికొన్ని రైళ్లను తాత్కాలికంగా ఇతర స్టేషన్ల నుండి నడపాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. స్టేషన్లలో రద్దీని తగ్గించి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు తెలిపారు.