Farmers Representative Image (Image Credit To Original Source)
Rythu Bharosa: తెలంగాణలోని రైతులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. రైతు భరోసా స్కీమ్ కి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ప్రభుత్వానికి చెందిన తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ ముఖ్యమైన ప్రకటన చేసింది. సంక్రాంతి నాటికి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందించనున్నట్లు తెలిపింది. కాగా, రైతు భరోసాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని కోరింది.
శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా వ్యవసాయేతర భూములను ఏరివేసే పనిలో ప్రభుత్వం ఉందని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. అర్హులైన అన్నదాతలకు ఎకరానికి 6వేల రూపాయల చొప్పున పండగ నాటికి జమ చేయనుందని స్పష్టం చేసింది. మొత్తం 4 లక్షల ఎకరాలు కమర్షియల్ ల్యాండ్‌గా గుర్తించినట్లు తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది.
రాష్ట్రంలో రైతు భరోసా స్కీమ్ ని ఆపేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ తేల్చి చెప్పింది. అర్హులైన రైతులందరికీ రబీ సీజన్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎకరానికి 6వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపింది. రైతు భరోసా పథకానికి అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి ప్రభుత్వం ‘శాటిలైట్ మ్యాపింగ్’ నిర్వహిస్తోందని వివరించింది. మ్యాపింగ్ పూర్తయ్యాక సాయం పంపిణీ చేయబడుతుందని పేర్కొంది. ఈ పథకంతో 65లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని చెప్పింది. ప్రస్తుతం ఆర్ధిక శాఖ అర్హులైన లబ్ధిదారులకు చెల్లింపులు చేయడం కోసం వారి జాబితాను సిద్ధం చేసి తిరిగి తనిఖీ కూడా నిర్వహిస్తోందని వివరించింది.
వాణిజ్య వినియోగంలో ఉన్న భూములకు సంబంధించి రైతు భరోసా ప్రయోజనాలు పొందుతున్న వారిని ఆ జాబితా నుండి తొలగించడానికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం జర్మన్ టెక్నాలజీ సాయంతో ‘శాటిలైట్ మ్యాపింగ్’ నిర్వహిస్తోంది.
సంక్రాంతి నాటికి రైతులకు ఆర్థిక సాయం అందేలా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖ అధికారులను శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, అలాగే జనవరి మొదటి వారం నాటికి సాగు భూములపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. రబీ సీజన్‌కు రైతు భరోసా సాయం కచ్చితంగా ‘శాటిలైట్ మ్యాపింగ్’ డేటా ఆధారంగా విడుదల చేయబడుతుంది. ఇది ప్రస్తుత ధృవీకరణ విధానం నుండి ఒక పెద్ద మార్పు అవుతుంది.
గత ఖరీఫ్ సీజన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో ప్రభుత్వం 90 రోజుల వ్యవధిలో పూర్తి చేయాల్సిన రైతు భరోసా పంపిణి కార్యక్రమాన్ని కేవలం 9 రోజులలోనే పూర్తి చేసి రికార్డ్ సృష్టించింది. గత పథకం కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 9 పని దినాలలో దాదాపు రూ.29వేల కోట్లను రైతుల ఖాతాలకు బదిలీ చేసింది. టిలైట్ మ్యాపింగ్ సాయంతో ప్రభుత్వం వాణిజ్య వినియోగంలో ఉన్న 4 లక్షల ఎకరాల భూమిని తొలగించగలిగింది. దీని వల్ల 2వేల కోట్లు ఆదా చేసింది.
Also Read: ఇంటర్ విద్యార్థుల పేరెంట్స్‌కు బిగ్ అలర్ట్.. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం..
తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పధకాన్ని ఆపేస్తున్నారు/ నిలిపివేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
అర్హులైన రైతులు అందరికి ప్రభుత్వం రబీ సీజన్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా, ఎకరానికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది.
ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రికను అనుకరిస్తూ ఒక… pic.twitter.com/kOZctY2fqe
— FactCheck_Telangana (@FactCheck_TG) January 2, 2026