కాంగ్రెస్‌కు గుడ్‌బై..? బీజేపీలో చేరనున్న విజయశాంతి!

  • Publish Date - October 27, 2020 / 08:47 PM IST

కాంగ్రెస్ నేత విజయశాంతి బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. నవంబర్ మొదటి వారంలో బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఢిల్లీ బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కిషన్‌రెడ్డితో విజయశాంతి చర్చలు జరపడంతో ఆమె బీజేపీలో చేరుతున్నారనే ఊహాగానాలకు మరింత బలానిస్తోంది.



మంచి రోజు చూసుకొని బీజేపీలో జాయిన్ అవుతానని విజయశాంతి చెప్పినట్టు సమాచారం. నడ్డా అమిత్‌షాల సమక్షంలో బీజేపీ తీర్థం రాములమ్మ పుచ్చుకోనుంది. రాములమ్మ మరికొంత మంది కాంగ్రెస్ నేతలతో బీజేపీతో టచ్‌లో ఉన్నారని అంటున్నారు.

కాంగ్రెస్ ప్రచారకమిటీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న విజయశాంతిపైనే.. ఇప్పుడు బీజేపీ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా.. తమ పార్టీలో చేర్చుకునేందుకు.. ముఖ్యనేతలు ప్రయత్నాలు మొదలెట్టేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా.. విజయశాంతి ఇంటికి వెళ్లి చర్చలు జరపడటంతో.. రాజకీయవర్గాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.



విజయశాంతిని బీజేపీలో చేరమనే అంశంపైనే కిషన్ రెడ్డి చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. విజయశాంతి ఇంటికి వెళ్లి చర్చలు జరపడంతో.. కాంగ్రెస్‌లో అలజడి మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ లీడర్లంతా.. ఈ విషయంపై అప్రమత్తమయ్యారు.

విజయశాంతితో ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ.. ఆవిడ ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు. కేవలం.. ఒక్క నాయకుడికి మాత్రమే.. ఫోన్ కాల్‌లో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.



ఆయనొక్కరికే.. కిషన్ రెడ్డి చర్చల సారాంశాన్ని వివరించారు విజయశాంతి. కాంగ్రెస్‌ను వీడొద్దంటూ.. పార్టీ ముఖ్యనేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. బుధవారం (అక్టోబర్ 28) స్వయంగా విజయశాంతి నివాసానికి వెళ్లి చర్చలు జరిపే అవకాశం ఉంది.