Gossip Garage: ఇరిగేషన్ ప్రాజెక్టులపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. పోటాపోటీ పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్స్‌ తో పెరిగిన హీట్

జనాలకే కాదు.. తమ పార్టీ లీడర్లలో కూడా చాలామందికి నీటిపాదరుల ప్రాజెక్టులు మీద..వాటి మీద జరుగుతోన్న రాద్దాంతం మీద అవగాహన లేదని భావిస్తున్నారట.

Gossip Garage: తెలంగాణలో అధికార, ప్రతిపక్షం మధ్య నీళ్ల నిప్పులు ఎంతకూ చల్లారట్లేదు. రోజురోజుకు వాటర్‌ వార్‌ పీక్‌ లెవల్‌కు చేరుకుంటోంది. తాము అధికారంలో ఉన్నప్పుడే నీళ్లు బాగా అందించామని బీఆర్ఎస్..ప్రాజెక్టులను కట్టిందే కాంగ్రెస్‌ అని ప్రభుత్వ ప్రతినిధులు పోటాపోటీ ప్రెస్‌మీట్లు, ట్వీట్లు, ఖండనలతో నీళ్ల పంచాయితీని నెక్స్ట్‌ లెవల్‌కు తీసుకెళ్లారు. ఇంత చేస్తున్నా ఎక్కడో తేడా కొడుతుందని..ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇస్తూ..అసలు మ్యాటరేంటో..తమ వెర్షన్ ఏంటో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు నేతలు.

వాటర్ సెంట్రిక్‌గా..రాజకీయ విమర్శల దాడి..
అది కాళేశ్వరం అయినా..బనకచర్ల అయినా..ఏ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అయినా సరే..వాటర్ సెంట్రిక్‌గా..రాజకీయ విమర్శల దాడే ప్రయారిటీగా పవర్ పాయింట్ పాలిటిక్స్‌తో హీట్‌ను పెంచుతున్నారు లీడర్లు. ప్రభుత్వం తరఫున ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీఆర్ఎస్‌ నుంచి మాజీ మంత్రి హరీశ్‌ రావు..పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్‌తో హోరెత్తిస్తున్నారు. డిటైల్డ్‌ సబ్జెక్ట్‌తో డేట్లు, జీవోలు, అనుమతులు, దరఖాస్తులు, పనులు..ఇలా ప్రతీది పకడ్బందీగా వివరిస్తూ వస్తున్నారు.

అయితే అటు ప్రభుత్వం తరఫున అయినా..ఇటు అపోజిషన్ అయినా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్‌ ఇవ్వడానికి చాలా రీజన్సే ఉన్నాయట. ప్రెస్‌మీట్లు పెట్టి చెప్తే జనాల్లోకి అసలు విషయం వెళ్లడం లేదనుకుంటున్నారట. అసలే ఇరిగేషన్‌ సబ్జెక్ట్‌. దానిపై నార్మల్‌ పబ్లిక్‌కే కాదు..ఎడ్యుకేడెట్‌ పర్సన్స్‌కు కూడా అంతంత మాత్రమే అవగాహన ఉంటుంది. అలాంటిది ప్రాజెక్టులు, అనుమతులు, జీవోలు, బేసిన్లు..ఇలాంటివి పూర్తిగా అర్థం కావాలంటే..డిటేయిల్డ్‌ ఇన్ఫర్మేషన్‌ను పబ్లిక్ ముందు పెట్టాల్సిందేనని అనుకుంటున్నారట.

జనాలకే కాదు.. తమ పార్టీ లీడర్లలో కూడా చాలామందికి నీటిపాదరుల ప్రాజెక్టులు మీద..వాటి మీద జరుగుతోన్న రాద్దాంతం మీద అవగాహన లేదని భావిస్తున్నారట. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మీడియాలో ఎక్స్‌పోజర్‌ రావడంతో పాటు..అటు జనాలకు అర్థమయ్యేలే చెప్పిన వాళ్లం అవుతామని.. ఇటు లీడర్లకు హితబోధ చేసినట్లు ఉంటుందని స్కెచ్ వేస్తున్నారట.

Also Read: సింగరేణిలో సమ్మె సైరన్.. బొగ్గు ఉత్పత్తికి బ్రేక్..! రూ.76 కోట్లు నష్టం..!

ఈ క్రమంలోనే ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్‌ రావు కాళేశ్వరంపై ఓసారి, బనకచర్లపై మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత ప్రెస్‌మీట్‌ పెట్టి కుండా డిస్‌ప్లేలో డిటేయిల్స్ చూయిస్తూ వివరించే ప్రయత్నం చేశారు. ఇక మంత్రి ఉత్తమ్‌ ఇప్పటికే ప్రభుత్వం తరఫున ఓసారి పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ..ఇప్పుడు మరోసారి మీడియా ముందుకు వచ్చి..ప్రాజెక్టులపై తమ వాదనేంటో వినిపించాలనుకుంటున్నారట.

అటు ఉత్తమ్, ఇటు హరీశ్‌రావు ఇస్తున్న పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్స్‌తో జనాలకు ఏం అర్థమవుతుందో..లీడర్లకు ఎంత వరకు ఎక్కుతుందో లేదో తెలియదు కానీ..పొలిటికల్‌గా మాత్రం చర్చకు దారితీస్తోంది. అటు ప్రభుత్వం..ఇటు అపోజిషన్ రెండు వైపులా ఎవరూ తగ్గడం లేదు. పోటాపోటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో ఈయన చెప్పింది ఆయన తప్పంటారు. ఆయన చెప్పింది ఈయన తప్పంటారు. మళ్లీ ఇద్దరూ జీవోలు, అనుమతులు, దరఖాస్తు పెట్టిన ఎకనాలెడ్జ్‌మెంట్లు అంటూ ప్రూఫ్స్ చూపిస్తూనే ఉన్నారు.

అసలు ఎవరు చెప్తున్నది కరెక్ట్‌.? ఇరిగేషన్‌ మంత్రిగా పనిచేసిన అనుభవంతో హరీశ్‌రావు చెప్తున్నది వాస్తవమా.? అధికారులు ఇస్తున్న వివరాలతో మాట్లాడుతున్న ఉత్తమ్‌ మాటలు నిజమా.? అసలేంటీ వాటర్‌ వార్‌ అనేది జనాలకు అర్థం కావడం లేదట. కొందరు కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్లు అయితే పర్టిక్యులర్‌గా కొంత టైమ్‌ తీసుకుని స్టడీ చేస్తున్నారట. ఈ క్రమంలో ఈ పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ పాలిటిక్స్‌ ఇంకెంత దూరమన్న చర్చ అయితే జరుగుతోంది.