Cm Revanth Representative Image (Image Credit To Original Source)
Cm Revanth Reddy: దమ్ముంటే అసెంబ్లీకి రా. అన్ని అంశాలపై చర్చిద్దాం. ఓడగొడితే ప్రజల ముఖం చూడవా అంటూ..కేసీఆర్ ఇగోను టచ్ చేస్తున్నారు సీఎం రేవంత్. గులాబీ బాస్ మాత్రం రేవంత్ వ్యూహానికి చిక్కకుండా సభకు రాకుండానే తన సెంట్రిక్‌గానే చర్చ జరిగేలా స్కెచ్ వేశారట. దీంతో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేలా రేవంత్ ఇంకా ప్రెజర్ పెంచుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. లేటెస్ట్‌గా ఎమ్మెల్సీ కవిత కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే అనడం హాట్ టాపిక్ అవుతోంది. సభకు రాకుండానే సార్ లైమ్‌లైట్‌లో ఉండే ప్లాన్ చేస్తున్నారా? ఏం చేసైనా కేసీఆర్‌ను అసెంబ్లీకి రప్పించాలనేది రేవంత్ వ్యూహమా?
మొన్నటి వరకు గులాబీ దళపతి మౌనం తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా కొనసాగింది. లేటెస్ట్‌గా సార్ మీడియా ముందుకు వచ్చారు. కృష్ణా జలాలు, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలపై స్ట్రాంగ్ వాయిస్ వినిపించి చర్చకు తెరలేపారు. ఆ తర్వాత అసెంబ్లీ సెషన్ స్టార్టింగ్ రోజు సభకు అటెండ్ అయి ఇంకా క్యూరియాసిటీ పెంచేశారు. అసెంబ్లీలో చర్చలో పాల్గొనేందుకు కేసీఆర్ వస్తున్నారంటూ లీకులు వచ్చాయి. కానీ శుక్రవారం జరిగిన సభకు సార్ రాలేదు. సెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ శాసనసభ్యులు కూడా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని వాకౌట్ చేశారు.
అయితే కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ ఎత్తుకున్న రాగాన్ని ఎంతకు వదిలి పెట్టడం లేదు సీఎం రేవంత్. పదేపదే సవాళ్లు విసురుతున్నారు. పైగా మీరు సభకు రండి..సలహాలు..సూచనలు ఇవ్వండి అంటూ పిలుపిస్తున్నారు. అంతటితో ఆగకుండా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన గౌరవానికి ఎలాంటి భంగం కలిగించబోమని హామీ ఇస్తున్నారు రేవంత్. గత సర్కార్ హయాంలో జరిగిన తప్పిదాలపై చర్చించేందుకు కేసీఆర్ సభకు రావాలని అంటున్నారు. అంతేకాదు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేలా తెలంగాణ ఉద్యమకారులు ఒత్తిడి తేవాలని కూడా రేవంత్ చెప్పుకొస్తున్నారు. మంత్రి వివేక్, ప్రభుత్వ సలహాదారు కేకే లాంటి తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేలా ప్రెస్‌మీట్ పెట్టాలంటూ స్వయంగా రేవంతే సూచించడం ఆసక్తికరంగా మారింది.
లేటెస్ట్‌గా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికీ ఎన్నో సార్లు కేసీఆర్‌కు సవాల్ చేశారు రేవంత్. అయినా కేసీఆర్ మాత్రం రేవంత్ సవాల్‌ను స్వీకరించి అసెంబ్లీకి రావడం లేదు. అసలు రేవంత్ పేరెత్తి మాట్లాడేందుకు సార్ ఇష్టపడట్లేదంటున్నాయి గులాబీ శ్రేణులు. రేవంత్ మాత్రం ఏం చేసైనా కేసీఆర్‌ను అసెంబ్లీకి రప్పించే స్కెచ్ వేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
కేసీఆర్ గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటానని చెప్తూనే.. దమ్ముంటే అసెంబ్లీకి రా అని సవాల్ విసరడం వెనక..పెద్ద ఎత్తుగడే ఉందన్న చర్చ జరుగుతోంది. అయితే లేటెస్ట్‌గా ఎమ్మెల్సీ కవిత కూడా సీఎం రేవంత్ లాగే..కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే అంటుండటం చర్చకు దారితీస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చి సమాధానం చెప్పకపోతే బీఆర్‌ఎస్ పని ఖతం అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తప్పు చేయకపోతే సభకు రావాల్సిందే అంటున్నారు కవిత. సభకు రాకుండా పిల్ల కాకుల మీద సభా సమయాన్ని వదలొద్దంటూ హితవు పలికారు.
ఇలా పార్టీ ఏదైనా..లీడర్ ఎవరైనా..అందరినోట సార్ సభకు రావాల్సిందేనన్న మాట వినిపించేలా చేయాలన్నదే రేవంత్ స్కెచ్ అంటున్నారు. ఓవైపు సీఎం రేవంత్.. కేసీఆర్ సభకు రావాలంటూ సవాళ్లతో ఇగోను టచ్ చేసే స్కెచ్ వేస్తున్నారట. ఇప్పటివరకు కేసీఆర్‌ను అసెంబ్లీకి రప్పించేందుకు రేవంత్ వేసిన ఎత్తులేవి సక్సెస్ కాలేదని..అందుకే రేవంత్ కొత్త డ్రామా షురూ చేశారని గులాబీ లీడర్లు మండిపడుతున్నారు.
అయితే కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ..తెలంగాణ ఉద్యమకారులతో ప్రెస్‌మీట్ పెట్టించి ప్రజల్లో ఓ చర్చకు తెరలేపాలనేది రేవంత్ వ్యూహమట. సరిగ్గా ఇదే టైమ్‌లో కవిత కూడా కేసీఆర్ సభకు రావాల్సిందేనంటూ మాట్లాడటం హాట్ టాపిక్ అవుతోంది. ఇలా అన్ని దిక్కుల ఒత్తిడి తెచ్చి కేసీఆర్‌ను అసెంబ్లీకి రప్పించేందుకు రేవంత్ వేస్తున్న ఎత్తులు ఎప్పుడు సక్సెస్ అవుతాయో చూడాలి.
Also Read: అవి నా భూములు కాదు.. పక్కనే నందమూరి బాలకృష్ణ, హరిబాబు భూములు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్